Madanapalle: భూ రీ-సర్వే వివాదం రైతు కుటుంబంపై దాడి, నలుగురికి గాయాలు!

0
124

Madanapalle: భూ రీ-సర్వే సందర్భంగా తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసి రైతు కుటుంబంపై దాడి జరిగిన ఘటన మదనపల్లె మండలంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, మదనపల్లె మండలం పోతబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని వందాడి వారిపల్లెకు చెందిన రైతు లక్ష్మన్నకు చెందిన భూమిపై వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో లక్ష్మన్న, కృష్ణయ్య లు ఇటీవల కోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందినట్లు తెలిపారు.

 

బుధవారం రెవెన్యూ అధికారులు భూమి రీ-సర్వేకు వచ్చిన సమయంలో లక్ష్మన్న, కృష్ణయ్య కోర్టు స్టే ఉత్తర్వులను అధికారులకు చూపించి, వాటి ప్రకారం సర్వే నిర్వహించాలని కోరారు. ఈ క్రమంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన ఎన్. శ్రీనివాసులు, రాధా వర్గీయులు లక్ష్మన్న కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడిలో లక్ష్మన్న, .కె.కృష్ణప్ప, కె. శ్రీనివాసులు, ఈశ్వరమ్మ లు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కనీస అభ్యసన సామర్థ్యాల పెంపుదలకు కృషి చేయాలి.
విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ డా. కె....
By Pagadala Venkateswar 2026-06-05 07:17:45 0 118
Telangana
" (Dacoit: A Love Story/Ek Prem Katha ఉత్కంఠభరితమైన ఈ పాన్-ఇండియా హిందీ-తెలుగు యాక్షన్-థ్రిల్లర్ ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది .
అడవిశేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్. మృనాళ్ థాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ...
By Thokala Sivaji 2026-03-30 02:42:22 0 589
Andhra Pradesh
పుంగనూరులో గరుడ సేవకు సర్వం సిద్ధం
పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసిన కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా...
By Kothuru Murali 2026-01-31 11:05:46 0 210
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యస్.బి.ఐ సాలరీ ఖాత వున్నవారికి 1కోటి ప్రమాద భీమా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలుకు ఉచితంగా 1కోటి రూపాయలు ప్రమాద భీమా అదీ ఎలాంటి ఖర్చు...
By Karapati Gopi 2026-01-01 10:48:13 0 828
Madhya Pradesh
MP’s Coking Coal Reserves Gain National Focus
Madhya Pradesh’s extensive coking coal reserves have taken center stage in national...
By Dunna Jessicaruth 2026-05-25 06:35:51 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com