MNKLIS Project

0
128

మక్తల్ – నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు (MNKLIS) భూ సేకరణ విషయంలో పనులు జాప్యం జరగొద్దని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుతో పాటు కొడంగల్ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గారు సమీక్షించారు.

 

✅ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు భూసేకరణ పనులు జాప్యం జరగొద్దని, భూసేకరణకు అవసరమైన సర్వేయర్ల నియమించడంతో పాటు బడ్జెట్ మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంగా చెప్పారు. భూసేకరణ పనులను పూర్తి చేసి టెండర్ ప్రక్రియను మొదలు పెట్టాలని ఆదేశించారు.

 

✅ కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KADA) కింద చేపట్టిన అభివృద్ధి పనులను శాఖల వారిగా సమగ్రంగా సమీక్షించారు. కొనసాగుతున్న ఆయా పనుల వివరాలను తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు.

 

✅ నియోజకవర్గంలోని గ్రామాల్లో రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో ఏ తండాలో రోడ్డు లేదన్న మాట వినిపించొద్దు, ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండేలా చూడాలని చెప్పారు.

 

✅ కొత్త గ్రామ పంచాయతీలకు సంబంధించి పంచాయతీ భవనాలను నిర్మించాలని, ఈఈ స్థాయి అధికారిని నియమించి నిరంతరం పనులు పర్యవేక్షించాలని సూచించారు.

 

✅ ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గోదావరిలో గల్లంతైన మదనపల్లె విద్యార్థి మృతదేహం లభ్యం
మదనపల్లెకు చెందిన బీటెక్ విద్యార్థి సతీష్ మృతదేహం గోదావరి నదిలో లభ్యమైంది. భద్రాచలం పరిధిలోని...
By Pagadala Venkateswar 2026-03-21 06:12:11 0 204
Telangana
సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
శ్రీరాంపూర్ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి స్టేడియంలో శ్రీరాంపూర్ సింగరేణి GM...
By Avunoori Mahesh 2026-06-03 02:13:28 0 166
Telangana
ఆసిఫాబాద్‌లో కలకలం దంపతుల అనుమానాస్పద మృతి
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్, జూన్ 18 కొమురం భీం...
By Chunarkar Jagadeesh 2026-06-18 07:01:23 0 260
Telangana
వాంకిడిలో కాంగ్రెస్ పార్టీ మండల సర్వసభ్య సమావేశం క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
🎤కుమురం భీమ్ ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: వాంకిడి మండలంలో  సంఘటన్ సృజన్ అభియాన్‌లో...
By Chunarkar Jagadeesh 2026-08-09 03:05:23 0 207
Andhra Pradesh
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ
*ఢిల్లీ*   తాజ్ ప్యాలెస్ హోటల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Rajini Kumari 2025-12-20 14:50:27 0 258
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com