ఆసిఫాబాద్‌లో ఈ నెల 22న మినీ జాబ్ మేళా జిల్లా ఉపాధి అధికారి కిరణ్ కుమార్

0
257

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):కుమారం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 22న (బుధవారం) ఉదయం 10:30 గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జనకపూర్ లోని MPDO ఆఫీస్ పక్కన ఉన్న టాస్క్ సెంటర్ (TASK Center) లో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ 'ఫోన్‌పే ప్రైవేట్ లిమిటెడ్' (Phonepe PVT LTD) లో గల 15 బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఈ మేళా నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి, 18 నుండి 25 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలు మరియు పురుషులు (M/F) ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థుల వద్ద సొంత బైక్ మరియు 4G/5G స్మార్ట్‌ఫోన్ తప్పనిసరిగా ఉండాలి.ఎంపికైన వారు ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, సిర్పూర్, వాంకిడి, కెరమెరి, బెజ్జూర్, కౌటాల ప్రాంతాలలో పని చేయాల్సి ఉంటుందని, వీరికి నెలకు ₹18,000 నుండి ₹25,000 వరకు జీతం లభిస్తుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్ మరియు బయోడేటా (Resume) లతో ఇంటర్వ్యూకి హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాల కోసం 7989733351, 9160608476 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Telangana
విద్యార్థులను అభినందించిన డీఈవో
విద్యా వారోత్సవాల్లో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన ఆర్ట్ , క్రాఫ్ట్, డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ...
By Nookapangu Manikanta 2026-05-16 10:28:35 0 323
Telangana
కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు కూతలు
కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకున్నా ‎కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వరి ధాన్యం...
By Ponnala Srinivasrao 2026-04-02 16:12:05 0 266
Uncategorized
The Rise of "Quiet Commuting"
A fascinating lifestyle shift is dominating May 2026: "quiet commuting." With hybrid work firmly...
By Dunna Jessicaruth 2026-05-19 06:37:28 0 171
Andhra Pradesh
Madanapalle: తమ ఆస్తులు సక్రమమేనని, అక్రమమని నిరూపిస్తే బహిరంగంగా సీజ్ చేసుకోవచ్చని మార్పురి వెంకటేష్ నాయుడిపై కోనేటి సులోచన కుమార్తె అనూష సవాల్ విసిరారు.
మదనపల్లె: తన తల్లి కోనేటి సులోచన పేరుతో ఉన్న ఆస్తి సక్రమంగా వచ్చినదేనని, అది అక్రమార్జన కాదని...
By Pagadala Venkateswar 2026-09-18 06:10:56 0 64
Telangana
జనప్రియ వద్ద RUB పనులను పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్.|
● నిర్మాణ పనుల పురోగతిపై ఆరా ● నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయడంపై దృష్టి ● స్థానికుల...
By Sidhu Maroju 2026-08-18 18:05:44 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com