కట్టు కాలువ సర్వేపై రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం

0
244

హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని మైలారం దాదాపు వందల ఎకరాలను వరద ముప్పు నుండి కాపాడే కట్టు కాలువ నేడు ఆక్రమణలకు గురై చాలా మంది రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.సుమారు 30 ఫీట్ల వెడల్పు గల ఈ కాలువ మరియు రోడ్డు గురించి గత 12 సంవత్సరాల నుండి దారి లేని రైతులు పోరాడుతూనే ఉన్నారు.కానీ రెవెన్యూ అధికారుల నుండి ఎటువంటి స్పందన లేదు.రెవెన్యూ నక్ష లో ఉన్న కాలువ, రోడ్డు కబ్జాకు గురవుతున్నప్పుడు లేదా భూ సమస్యలపై ఫిర్యాదులు చేసినప్పుడు క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు సరిగ్గా స్పందించకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మండల వ్యాప్తంగా ఇలాంటి నిర్లక్షలాపై రైతుల నుండి తీవ్ర ఆగ్రహం వెల్లడవుతుంది. మైలారం గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయం నుండి దాదాపు 3 కిలోమీటర్ల మేర ఉంటూ శ్రీరాముల రాజయ్య భూమి వరకు ఉన్న కట్టు కాలువ,రోడ్డు పనుల నిమిత్తం వచ్చే సర్వే అధికారులను గత కొన్ని సంవత్సరాలుగా కొందరు రైతులు అడ్డుకుంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాలతో ఆర్డీవో మరియు ఎమ్మార్వో అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన కట్టుకాలువ సర్వే కేవలం డిప్యూటీ సర్వేయర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ప్రైవేట్ సర్వేయర్లను పెట్టి తూతూ మంత్రంగా చేసి వెళ్లిపోవడం చర్చనీయంచమైంది. కేవలం సగం మాత్రమే సర్వే చేసిన డివిజన్ సర్వేయర్ మిగతా ప్రాంతాన్ని సర్వే చేయడానికి కారణాలు వెతుక్కుని వెళ్ళిపోయాడు. దీనిపై పరకాల ఆర్డీవో వెంకన్నను సోమవారం ప్రజావాణిలో రైతులు అడుగగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆర్డీవో కనీసం గత 12 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యకు పరిష్కారం చెప్పకుండా రైతులే సమస్యను పరిష్కరించుకోవాలని,లేనిచో రెవెన్యూ అధికారులు రారని రైతులను వెనుతిప్పారు.కావున జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రెవెన్యూ అధికారులు స్పందించి సర్వే నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి మహోత్సవాల సందర్భంగా...
By Boya Dasthagiri 2026-04-26 13:05:12 0 193
Andhra Pradesh
నేపాల్ వరదల్లో మృతుల ఆత్మశాంతికి మౌనం పాటించారు
పాలకొండలోని ఋషి యోగా కేంద్రంలో యోగా మాస్టర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో యోగా సభ్యులు ఆదివారం ఉదయం నేపాల్...
By Boiena Rajesh 2026-08-30 07:16:35 0 103
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం
పత్రికాప్రకటన, ఇంద్రకీలాద్రి, విజయవాడ, 26 Dec, 2025 –          ...
By Rajini Kumari 2025-12-26 10:04:50 0 261
Technology
The Agentic AI Shift: Reforming India’s GCCs
Financial experts are sounding an alarm for India’s massive white-collar sector as Global...
By Dunna Jessicaruth 2026-05-26 08:59:31 0 560
Rajasthan
All 16 Saved as Bengaluru-Bound Bus Catches Fire
A major tragedy was narrowly averted on Pali Road near Jodhpur last night when a Bengaluru-bound...
By Dunna Jessicaruth 2026-05-20 10:25:26 0 289
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com