Madanapalle: మదనపల్లె గవిగుండు శివాలయంలో ఐటీబీపీ సిబ్బంది, హరి డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణపై అవగాహన.

0
121

మదనపల్లె: మదనపల్లె సమీపంలోని గవిగుండు శివాలయం పరిసరాల్లో ఆదివారం ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) హెచ్‌సీ సిరిగల రెడ్డెప్ప ఆధ్వర్యంలో, సీటీఎంకు చెందిన హరి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు, క్రాస్ రోడ్ పంచాయతీ ఇందిరమ్మ కాలనీ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు.

 

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, ముళ్లు, పొదలు, ఇతర వ్యర్థాలను తొలగించారు. భక్తులకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా హెచ్‌సీ సిరిగల రెడ్డెప్ప మాట్లాడుతూ, పరిశుభ్రమైన పరిసరాలు ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

 

ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హరి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు, ఇందిరమ్మ కాలనీకి చెందిన మంజుల, భవాని, రెడ్డెమ్మ, అంజమ్మ, కిరణ్ కుమారి, సోమశేఖర్, హనుమంత్ రెడ్డి, శ్రీనివాసులు, సతీష్, రమేష్ చిట్టీ, మల్లెల వాసు, విఘ్నేష్, రామచంద్రతో పాటు మహిళలు, యువకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా సేవలందించారు

Search
Categories
Read More
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:31:29 0 83
Andhra Pradesh
రేపు ప్రజాదర్బార్
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత రెడ్డి గారి నివాసం లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు . నియోజకవర్గ...
By Gitta Raju 2026-04-16 13:14:25 0 371
Andhra Pradesh
నూతన సంవత్సర శుభాకాంక్షలు
భారత్ ఆవాజ్  మీడియా మిత్రులకు, ప్రతినిధులకు  మరియు ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర...
By Karapati Gopi 2026-01-01 00:40:13 0 830
Telangana
కొందుర్గు ఎంపీడీవో ఆఫీసులో అధికారుల నిర్లక్ష్య పర్వం.|
      హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కొందుర్గు: ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళలు...
By Sidhu Maroju 2025-12-29 12:54:11 0 400
Sports
Garhwal United Crowned IWL 2 Champions with Dominant Win Over Roots FC
Garhwal United Crowned IWL 2 Champions with Dominant Win Over Roots FC MAPUSA: Garhwal United...
By BMA ADMIN 2025-05-21 09:32:15 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com