Madanapalle: సమృద్ధిగా వర్షాలు కురవాలని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష సూచనల మేరకు 34, 35వ వార్డుల ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.

0
107

Madanapalle: రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు, పశుపక్షాదులు నీటి సమస్యల నుంచి గట్టెక్కాలని ఆకాంక్షిస్తూ మదనపల్లె పట్టణంలోని రామిరెడ్డి లేఔట్ 34వ వార్డులో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష సూచనల మేరకు, 34వ వార్డు ఇన్‌చార్జ్ బాలమలి శేఖర్, 35వ వార్డు ఇన్‌చార్జ్ స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని ప్రార్థించారు.

 

ఈ సందర్భంగా బాలమలి శేఖర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులు తొలగి, చెరువులు, కుంటలు నిండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించామని తెలిపారు. రైతుల కష్టాలు తీరాలని, ప్రతి కుటుంబం ఆనందంగా ఉండేలా సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకున్నామని చెప్పారు.

 

35వ వార్డు ఇన్‌చార్జ్ స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి వ్యవసాయం అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ప్రార్థించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
పత్తి కొనుగోళ్లలో కేంద్ర బీజేపీ - రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ల నిర్లక్ష్య వైఖరి,
  పత్తి రైతుకు కన్నీరే మిగిల్చింది.   రైతులు నేరుగా మార్కెట్ కు తెచ్చే పత్తికి అనేక...
By Prashanth Goindla 2025-12-22 07:43:53 0 392
Telangana
వరంగల్ జిల్లా లో వడదెబ్బతో 11 మంది మృతి....
వరంగల్: వడదెబ్బతో 11 మంది మృతి! భారత్ అవాజ్ న్యూస్: 23 మే వరంగల్ జిల్లాలఓరుగల్లులో ఎండ తీవ్రత...
By Gujile Ramu 2026-05-23 07:58:06 0 181
Telangana
మ్యాపింగ్ కాని ఓటర్లకు త్వరగా నోటీసులు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశం
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మ్యాపింగ్ కాని ఓటర్లకు, తప్పుల...
By Chunarkar Jagadeesh 2026-08-24 23:46:45 0 235
Telangana
ఏజెన్సీ మారుమూల ప్రాంతం నుండి మెరిసిన విద్యా కుసుమాలు
మహబూబాబాద్,ఏప్రిల్ 29: కొత్తగూడ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొగుళ్లపల్లి నుండి మండల...
By Bheeshman King 2026-04-29 12:16:03 0 1K
Puducherry
Puducherry Leads with e-Buses and Smart ICCC
Puducherry’s urban landscape is undergoing a digital revolution under the Smart City...
By Lokeshwari Panthadi 2026-06-29 04:49:03 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com