ప్రమాదవశాత్తు మృతి చెందిన విద్యార్థి సాత్విక్ కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

0
232

రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థి సాత్విక్ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన విషాద ఘటన పట్ల పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ గారు బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి, సాత్విక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదారుస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, "చిన్న వయసులోనే సాత్విక్ వంటి విద్యార్థిని కోల్పోవడం అత్యంత విషాదకరం. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ కష్టకాలంలో వారికి అండగా ఉంటాం. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని అన్నారు.ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మహనీయుల త్యాగాలు మరువలేనిది
స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణత్యాగం చేసిన మహనీయులు త్యాగాలు మరువలేనిదని ఆర్డీఓ రామ్మోహనరావు అన్నారు....
By Boiena Rajesh 2026-08-12 13:54:33 0 90
Andhra Pradesh
పాలెంకొండలో మహిళపై దాయాదుల దాడి.. కేసు నమోదు.
మదనపల్లె మండలం పాలెంకొండ గ్రామంలో గురువారం ప్రేమకుమారి అనే మహిళపై దాయాదులు మూకుమ్మడిగా దాడి...
By Pagadala Venkateswar 2026-06-19 04:43:33 0 114
SURAKSHA
Shruti Arora IPS: Leading Chandigarh with Courage
A dedicated AGMUT Cadre IPS officer committed to professional policing, public safety, community...
By Lokeshwari Panthadi 2026-07-28 13:56:24 0 243
Telangana
సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చవద్దు: డిజిపి
హైదరాబాద్:  న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడితే ప్రజల్లో నమ్మకం...
By Sidhu Maroju 2025-10-14 07:16:20 0 293
Andhra Pradesh
🧹స్వచ్ఛతతో ఆరోగ్యం ఆత్మగౌరంతో జీవనం కలెక్టర్ సి పి రాజబాబు గారు
📍 వెంగళాపురం గ్రామం | 20-06-2026   🧹 స్వచ్ఛతతో ఆరోగ్యం – ఆత్మగౌరవంతో జీవనం: కలెక్టర్...
By Chennaiah Kati 2026-06-22 06:11:46 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com