అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ...ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతులను చేపట్టి పూర్తిచేస్తాం : బిఆర్ ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.

0
1K

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 22వ వార్డుకు చెందిన డ్రీమ్ వ్యాలీ, ఇందిరమ్మ కాలనీ ఫేస్ - 1, గ్రీన్ పార్క్ కాలనీవాసులు మాజీ వార్డు సభ్యులు సంధ్యా హనుమంతరావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారిని కలిసి ఆయా కాలనీలలో మాలిక వసతులు అన్ని దాదాపు పూర్తయ్యాయని, అక్కడక్కడ మిగిలిపోయిన సిసి రోడ్డు నిర్మాణం, డ్రీమ్ వ్యాలీ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు లింక్ రోడ్డు ఏర్పాటు, ఇందిరమ్మ కాలనీ ఫేస్ -1 లో మంచినీటి స్టోరేజ్ కోసం వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే  మాట్లాడుతూ.... నగర శివారు మున్సిపాలిటీ లైన దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీలలో ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతుల కల్పన చేపట్టడం జరిగిందని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ఇంకేమైనా పనులు మిగిలిపోయి ఉంటే త్వరలోనే చేపట్టి పూర్తి చేస్తామన్నారు. అనంతరం సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడిన ఎమ్మెల్యే గారు మౌలిక వసతులైన సిసి రోడ్డు, వాటర్ ట్యాంక్, లింకు రోడ్డు పనులను త్వరీతగతిన చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
ఈ పాప తప్పిపోయి ప్రస్తుతం గూడూరు పోలీసు స్టేషన్ లో ఉంది.ఆచూకీ తెలిసిన వాళ్ళు గూడూరు పోలీసు వారికి తెలుపగలరు
ఈ పాప తప్పిపోయి ప్రస్తుతం గూడూరు పోలీసు స్టేషన్ లో ఉంది.ఆచూకీ తెలిసిన వాళ్ళు గూడూరు పోలీసు వారికి...
By mahaboob basha 2025-07-18 14:40:05 1 840
Telangana
భార్యను హత్య చేసిన భర్త... ?
మహబూబాబాద్ ,కొత్తగూడ డిసెంబర్ 14 (భారత్ ఆవాజ్): వివాహిత దారుణంగా హత్యకు గురైన సంఘటన, మహబూబాబాద్...
By Vijay Kumar 2025-12-14 13:20:04 0 61
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com