Madanapalle: చేనేత కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘నేతన్న భరోసా’ ఆర్థిక సాయాన్ని రూ. 25 వేలకు పెంచింది.

0
87

Madanapalle: చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష, జహా యువసేన నాయకుడు బాలమాలి శేఖర్ పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 'నేతన్న భరోసా' పథకం కింద ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం చేనేత కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయమని వారు తెలిపారు.

 

గతంలో అందించిన మొత్తానికి అదనంగా రూ.1,000 పెంచి రూ.25 వేలుగా ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే షాజహాన్ భాష అన్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని వేలాది చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కలగడంతో పాటు వారి జీవనోపాధికి మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు.

 

అదేవిధంగా, చేనేత రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేతి మగ్గాలకు నెలకు 200 యూనిట్లు (పవర్‌లూమ్‌లకు) 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కూడా చేనేత కార్మికులకు ఎంతో మేలు చేస్తోందని తెలిపారు. ఈ చర్యలతో ఉత్పత్తి వ్యయం తగ్గి, చేనేత కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
ఈ రోజు ఉదయం 6గo! మున్సిపల్ కార్పొరేషన్  కామిష్నార్ 41 వ డివిజాన్ లో పర్యాటించారు. డి విజాన్...
By Sadaq Sadaq 2026-05-14 04:33:39 0 156
Andhra Pradesh
TDP ఎమ్మెల్సీ పంచుమూర్తి అనురాధ గారి స్క్రోలింగ్ పాయింట్స్
టీడీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి చీఫ్ విఫ్ పంచుమర్తి అనురాధ గారి స్క్రోలింగ్ పాయింట్స్   యువతకు...
By Rajini Kumari 2025-12-20 13:03:11 0 411
Telangana
ఈ ఫొటోలోని వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే 1098కి కాల్ చేయండి .
ఈ ఫొటోలోని వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే 1098కి కాల్ చేయండి  ‎ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు...
By Ponnala Srinivasrao 2026-05-16 04:17:37 1 201
SURAKSHA
H. Venkatesh IPS: A Leader Dedicated to Professional Policing
"Effective policing is built on discipline, integrity, and the confidence of the people." These...
By Fathima Safa 2026-07-08 09:38:35 0 236
Telangana
అత్యంత వైభవంగా కాజీపల్లి రేణుక ఎల్లమ్మ తల్లి జాతర
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లిలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా,...
By Ponnala Srinivasrao 2026-03-17 13:13:46 0 278
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com