Madanapalle: మదనపల్లెలో ఈ నెల 18న సీఎం చంద్రబాబు పర్యటన. భద్రత, సభా ఏర్పాట్లపై కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఉన్నత స్థాయి సమీక్ష.

0
88

మదనపల్లె: ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదనపల్లె పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత భద్రతా, పరిపాలనా ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ఆధ్వర్యంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) సమావేశం నిర్వహించి పర్యటన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

 

సీఎం సెక్యూరిటీ అదనపు ఎస్పీ ఆర్.పి.ఎల్. శాంతికుమార్, డీఎస్పీ కె. శివ పోతురాజు, ఐఎస్‌డబ్ల్యూ అధికారులతో కలిసి హెలిప్యాడ్, ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్ మ్యాప్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

 

ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో కరపత్రాలు విడుదల చేసిన ఏఐఎస్ఎఫ్
అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో బసరాజ పాఠశాల వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విద్య,...
By Kothuru Murali 2026-05-24 17:27:53 0 118
Andhra Pradesh
Chandrababu: ప్రకృతి సేద్యంతో భూమిని బాగు చేద్దాం: దావోస్ వేదికగా సీఎం చంద్రబాబు పిలుపు.
Chandrababu: ప్రకృతి సేద్యంతో భూమిని బాగు చేద్దాం: దావోస్ వేదికగా సీఎం చంద్రబాబు పిలుపు...
By Pagadala Venkateswar 2026-01-22 06:29:38 0 191
Andhra Pradesh
ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి: నివాళులర్పించిన ఇంచార్జ్ జేసి.
మదనపల్లె కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి...
By Pagadala Venkateswar 2026-03-13 10:39:02 0 250
Andhra Pradesh
వైఎస్సార్‌సీపీ యువజన కార్యదర్శి చెంగారెడ్డికి బెంగళూరులో ఘన సన్మానం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కె. చెంగారెడ్డి గారికి బెంగళూరు ఐటీ...
By Kothuru Murali 2026-05-17 17:03:02 0 115
Telangana
పెద్దపల్లి : తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి...!
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కేంద్రానికి చెందిన గీత కార్మికులు బిక్షపతి కుమిరే గ్రామంలో...
By Sunka Santhosh 2026-06-18 19:18:19 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com