Madanapalle: మదనపల్లె తట్టివారిపల్లి జంక్షన్‌లో తాలూకా ఎస్సై రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు.

0
91

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని తట్టివారిపల్లి జంక్షన్ వద్ద తాలూకా ఎస్సై రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారు, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు లేని వారు, ఓవర్‌లోడ్‌తో ఆటోలు నడిపిన డ్రైవర్లను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలానాలు విధించారు.

 

ఈ సందర్భంగా ఎస్సై రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవడం, ఆటో డ్రైవర్లు ప్రయాణికులను పరిమిత సంఖ్యలో మాత్రమే ఎక్కించుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ప్రజల ప్రాణ భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఎస్సై రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీకాకుళం నూతన బార్ కౌన్సిల్ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది కున రాజారావు
జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో సీనియర్‌ న్యాయవాది కూన రాజారావు అధ్యక్షుడిగా...
By Manda Ramkumar 2026-03-27 04:55:05 0 227
SURAKSHA
. Modern Traffic Management Initiatives
​Content: Amid rapid urbanization, Karnataka Police has adopted various technical solutions to...
By Kalaga Sailaja 2026-06-29 11:02:47 0 172
Andhra Pradesh
పుంగనూరు ; ఒక రోజు ముందే పెన్షన్ల పంపినీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ...
By Kothuru Murali 2026-02-28 13:02:03 0 167
Telangana
ఫాదర్ బాలయ్య నగర్ ల్లో కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా :అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్‌లో ఉన్న...
By Sidhu Maroju 2025-08-21 15:47:41 0 667
Andhra Pradesh
పిల్లి మణిక్యరావు కు స్వగతం పలుకుతూ గుంటూరు అర్బన్ కమిటీ సభ్యులు
పిల్లి మణిక్యరావు కి స్వాగతం పలుకుతూ గుంటూరు అర్బన్ కమిటీ సభ్యులు పదవి ప్రమాణ స్వీకారం లైవ్...
By SivaNagendra Annapareddy 2026-01-21 12:12:27 0 667
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com