ఎల్ నినో" ప్రభావం కంటే రేవంత్ రెడ్డి గారి, విధ్వంసకర భాష నే రాష్ట్రానికి,ఎక్కువ నష్టం..చెరుకు సుధాకర్

0
191

రేవంత్ రెడ్డిగారు!రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాదు..మీరు ఈ రాష్ట్రానికి శాంతి భద్రతలు, చట్టబద్ధ ప్రవర్తన ఇంకా చాలా విషయాలు ముడివడి ఉన్న బాధ్యత గల హోం మంత్రి కూడా.. ఆ విషయం మర్చిపోయి హంతక భాష.. బెల్టు ట్రీట్మెంట్ భాష... కిలాడి భాష, ప్రతిపక్ష నాయకుల రక్తమును పంటలకు ఎరువుగా చల్లే ఎర్ర గులాబీ సినిమాలోని భాష..ఇట్లనే కొనసాగిస్తే ఎల్ నినో ప్రభావం కంటే మీ విధ్వంసకర భాషను ఎక్కువ నష్టం రాష్ట్రానికి కలిగించ నున్నది.మీరు కూలేశ్వరం అని తూలనాడే కాలేశ్వరం ఎంత తప్పుడుగా ప్రచారం చేసిన... ఇప్పుడు ఈ క్షణానికి అక్కడ ప్రవహిస్తున్న గోదావరి ప్రవాహం లక్ష క్యూసెక్లు. కన్నేపల్లి పంప్ హౌస్ ప్రారంభమైతే ప్రతిరోజు రెండు నుండి మూడు టీఎంసీలు నిరంతరం మూడు నెలలు ఎత్తిపోసి లక్షల ఎకరాల భూములకు నీళ్లు అందించే అవకాశం.

బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి ఒక నీటి ప్రాజెక్టు గురించి ఇంత తప్పుడుగా మాట్లాడి ఇంత రాద్ధాంతం చేసి నీటి వనరులతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులతో ముడిపడి ఉన్న ఇంజనీర్లను సాంకేతిక నిపుణులను బెల్టు ట్రీట్మెంట్ ఇస్తామని బెదిరించిన దాఖలా లేదు.

‎తెలంగాణ మొత్తం ప్రజలకు ఏనాడు నీటి విషయాలను చర్చించని సాధారణ జనానికి జర్నలిస్టులకు కూడా ప్రభుత్వం అనుకుంటే నీళ్లు లిఫ్ట్ చేసి తెలంగాణ కరువును ఆపవచ్చని అర్థమవుతున్న మీకు అర్థం కావట్లేదా? లేదా గుడ్డి ద్వేషంతో ఒక కుటుంబం పై కక్ష కట్టడం ద్వారా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలనే గొడ్డలితో తెగ నరకాలనుకుంటున్నారా?

‎ఇప్పటికైనా విజ్ఞుల మాటలు వినండి... పాలకపక్షానికైనా ప్రతిపక్షానికైనా స్వరాష్ట్ర ప్రయోజనాలు ప్రజల దాహార్తి వ్యవసాయ అవసరాలు ఇవే ముఖ్యం కానీ మరేవీ కావని గుర్తించండి

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: 'అంబులెన్స్‌కు ఫోన్ చెయ్యలేదు.. ఆ వార్త అవాస్తవం'
పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామానికి చెందిన నారాయణమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె భర్త రామయ్య...
By Kothuru Murali 2026-02-25 09:52:49 0 195
Andhra Pradesh
ములకలచెరువు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.
శుక్రవారం మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో రెడ్డెంవారిపల్లికి చెందిన రైతు...
By Pagadala Venkateswar 2026-06-27 05:53:29 0 97
Telangana
బొమ్మలోనూ కనిపించిన అమ్మతనం.. లేగదూడ ఆప్యాయత వైరల్
గోవు బొమ్మను చూసిన ఓ లేగదూడ, అది తన తల్లేనని భావించి ఆప్యాయంగా దగ్గరకు వెళ్లి చనుబాలు వెతికిన...
By Ponnala Srinivasrao 2026-09-05 01:41:16 0 173
Telangana
అల్వాల్ లో ఘనంగా స్వర్గీయ సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
                  మేడ్చల్ మల్కాజిగిరి...
By Sidhu Maroju 2025-08-18 16:31:05 0 653
Telangana
సికింద్రాబాద్ వైఎంసీఏలో ఆడిటోరియం, గెస్ట్ రూములను ప్రారంభించిన మంత్రులు అట్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వైఎంసిఏ లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం, గెస్ట్ రూమ్ లను మంత్రులు...
By Sidhu Maroju 2025-09-12 10:30:35 0 335
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com