శ్రీ లక్ష్మీనగర్‌లో సీసీ రోడ్ల పనుల పరిశీలన.|

0
124

"కాలనీ అధ్యక్షుడి వినతితో రూ.51 లక్షల నిధులు.. ప్రారంభమైన సీసీ రోడ్ల నిర్మాణం"

మేడ్చల్ మల్కాజ్గిరి జులై 13: ఓల్డ్ ఆల్వాల్ పరిధిలోని శ్రీ లక్ష్మీనగర్ కాలనీలో రూ.51 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి తోట లక్ష్మీకాంత్ రెడ్డి సోమవారం పరిశీలించారు. 

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో పనులు చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు.

కాలనీ అధ్యక్షుడు బి. నాగేశ్వరరావు వినతి మేరకు, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు చేసిన ప్రతిపాదనతో ఈ సీసీ రోడ్ల పనులకు రూ.51 లక్షల నిధులు మంజూరై పనులు ప్రారంభమైనట్లు స్థానికులు తెలిపారు. 

ఈ సందర్భంగా కాలనీవాసులు మైనంపల్లి హనుమంతరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు బి. నాగేశ్వరరావుతో పాటు భాస్కర్ గౌడ్, నారాయణప్ప, రవి, జైపాల్ రెడ్డి, శివరాజ్, నాగన్న, రాము, మనోహర్ రావు, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, నాగరాజ్ పాల్గొన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ-బ్లాక్ అధ్యక్షుడు కేబుల్ శేఖర్, జిల్లా కార్యదర్శి భబిత, సూర్యకిరణ్, బలవంత్ రెడ్డి, కృష్ణ గౌడ్, లావణ్య, సుకన్య, అశోక్, దేవేందర్, ప్రవీణ్, మధుసూదన్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీసీ రోడ్ల నిర్మాణాన్ని నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తోట లక్ష్మీకాంత్ రెడ్డి సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పెండ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
కంచికచర్ల మండలం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య  పెండ్యాల...
By Patan Khuddus 2026-05-13 16:37:38 0 383
Telangana
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిగా K. నవీన్ కుమార్
మహబూబాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిగా వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్...
By Bheeshman King 2026-07-03 12:43:41 0 646
Andhra Pradesh
పుంగనూరు మండలాల్లో 8 గంటలైనా తగ్గని మంచు
పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో శనివారం ఉదయం 8 గంటలైనా పొగమంచు తీవ్రత తగ్గలేదు. దీనితో గ్రామాల...
By Kothuru Murali 2026-01-03 11:05:40 0 241
Andhra Pradesh
PM సూర్య ఘర్ & పీఎం కుసుం కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం అమరావతి నుంచి రాష్ట్ర స్థాయి వీడియో...
By Pagadala Venkateswar 2026-02-21 04:32:47 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com