నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు

0
110

నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు

గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ రోజు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు మరియు చెడు నడత కలిగిన వారికి పోలీసు అధికారులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి పూర్తిగా స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇటీవల ఒక రౌడీ షీటర్‌పై పీడీ యాక్ట్ అమలు చేసి రాజమండ్రి జైలుకు పంపించగా, బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించిన రౌడీ షీటర్లకు ను మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వద్ద హాజరు పరిచి తగిన ఆదేశాలు తీసుకోవడం జరుగుతుంది. 

రౌడీ షీటర్లు మరియు నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులపై జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగుతోందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

జిల్లా పోలీసు కార్యాలయం, గుంటూరు.

Search
Categories
Read More
Andhra Pradesh
గ్రంథాలయంలో బాబు జగజీవన్ కు ఘన నివాళి
నందిగామ జూలై 6 భారత్ అవాజ్ : నందిగామ శాఖ గ్రంథాలయంలో భారత మాజీ ఉపప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు...
By Patan Khuddus 2026-07-06 16:45:35 0 248
Telangana
ఈస్ట్ మారేడ్‌పల్లి ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇనిస్టిట్యూట్‌లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంగళవారం ఈస్ట్ మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ...
By Sidhu Maroju 2026-06-23 09:22:26 2 1K
BMA
New Editorial Roles: The Rise of AI Ethics Editors
The deep integration of artificial intelligence is creating entirely new job categories and...
By JoinBMA 2026-08-21 09:37:57 0 149
Andhra Pradesh
బాపట్లలో SAAP లీగ్–2026 జిల్లా స్థాయి చెస్ పోటీలు
బాపట్ల జిల్లా: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ,జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (District Sports...
By Gadiyapudi Narendra 2026-02-17 16:12:04 0 250
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం కొత్తూరు మురళి: అగ్నిప్రమాదంలో 140 చెట్లు దగ్ధం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో...
By Kothuru Murali 2026-02-20 09:18:46 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com