అమరావతి లా అండ్ ఆర్డర్ ఓఎస్డీగా నియమితులైన శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే, ఐపీఎస్ గారు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు

0
108

అమరావతి లా అండ్ ఆర్డర్ ఓఎస్డీగా నియమితులైన శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే, ఐపీఎస్ గారు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు

నిన్న అమరావతి లా అండ్ ఆర్డర్ ఓఎస్డీగా నియమితులైన శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే, ఐపీఎస్ గారు, ఈ రోజు గుంటూరు జిల్లా పోలీసు క్యాంపు కార్యాలయంలో గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

2022 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే గారు రాజంపేట నుంచి బదిలీపై అమరావతి లా అండ్ ఆర్డర్ ఓఎస్డీగా నియమితులై, నిన్న బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీ గారిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారు శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమరావతి రాజధాని ప్రాంతం అత్యంత ప్రాధాన్యత కలిగిన సున్నిత ప్రాంతం కావడంతో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

అలాగే తుళ్లూరు–సీఆర్డీఏ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ నిర్వహణలో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన భద్రత కల్పించేలా కృషి చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం నేడు మృత్యుంజయ హోమం.
  పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం నేడు మృత్యుంజయ హోమం  Andhra Mrithyunjaya Homam on April...
By Pagadala Venkateswar 2026-04-21 03:34:11 0 142
Andhra Pradesh
చిన్న శ్రీను చేరికపై పల్లా క్లారిటీ
చిన్న శ్రీనును స్థానిక TDP నాయకత్వం అంగీకారంతోనే పార్టీలోకి తీసుకున్నామని AP TDP అధ్యక్షుడు పల్లా...
By Boiena Rajesh 2026-09-12 01:01:01 0 114
Andhra Pradesh
In September or October notification dsc
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులరా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కండి. వచ్చే నెల నుంచి వరుసగా...
By G k Nookala 2026-08-23 06:40:15 0 122
Telangana
Central election commission gives green signal for kavitha new party
“తెలంగాణ రక్షణ సేన”కు సీఈసీ గ్రీన్ సిగ్నల్.. కవితకు అధికారిక అనుమతి   కేంద్ర...
By G k Nookala 2026-04-30 10:37:58 0 337
Andhra Pradesh
పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
*పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...*   దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.లీటరు...
By Rajini Kumari 2026-05-15 11:48:32 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com