గుంటూరు జిల్లాలో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ – 720 చలానాలు, రూ.4,74,080 /- జరిమానా; 720 మందికి రోడ్డు భద్రత అవగాహన

0
188

గుంటూరు జిల్లాలో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ – 720 చలానాలు, రూ.4,74,080 /- జరిమానా; 720 మందికి రోడ్డు భద్రత అవగాహన

గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడం, ట్రాఫిక్ నిబంధనల అమలును కట్టుదిట్టం చేయడం లక్ష్యంగా నిన్నటి రోజు(09.07.2026)న సాయంత్రం 5.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ట్రాఫిక్ అమలు (Special Enforcement Drive) కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో జిల్లాలోని 31 బ్లాక్ స్పాట్లు మరియు మరో 21 ఇతర కీలక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై మొత్తం 720చలానాలు నమోదు చేసి రూ.4,74,080 జరిమానా విధించారు.

ఈ ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా నమోదైన ఉల్లంఘనలు:-

హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులపై మరియు కార్ లో సీట్ బెల్ట్ ధరించని వారిపై 250 కేసులు.

ట్రిపుల్ రైడింగ్‌పై – 53 కేసులు.

ప్రమాదకరంగా వాహనాలు నడిపిన వారిపై – 28 కేసులు.

రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై – 16 కేసులు

మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపిన వారిపై – 16 కేసులు.

మద్యం సేవించి వాహనం నడిపిన 4 మందిపై కేసులు నమోదు చేశారు.

మైనర్ డ్రైవింగ్ చేసినవారు 3 కేసులు నమోదు చేశారు.

ఇతర మోటారు వాహన చట్ట ఉల్లంఘనలకు సంబంధించి 198 కేసులు నమోదు చేసినారు.

అదేవిధంగా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు మరియు హెల్మెట్ వాడకంపై జిల్లా వ్యాప్తంగా 15 రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా 220 మంది డ్రైవర్లు, 85 మంది విద్యార్థులు, 415 మంది సాధారణ ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. మొత్తం 720 మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, మొబైల్ ఫోన్ వినియోగించకుండా డ్రైవింగ్ చేయడం ద్వారా, రాత్రివేళ నిదర టైములో డ్రైవింగ్ చేయ కుండా ఉండటం వలన ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.

ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా ఇటువంటి ప్రత్యేక అమలు డ్రైవ్‌లు, రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని గుంటూరు జిల్లా పోలీసులు తెలిపారు.

Search
Categories
Read More
Entertainment
India enter T20 world Cup final
టీ20 వరల్డ్‌ కప్‌: ఫైనల్‌లోకి భారత్‌ 🏏🇮🇳 టీ20 వరల్డ్‌ కప్‌ రెండో...
By G k Nookala 2026-03-05 17:40:08 0 172
SURAKSHA
Haryana STF Crackdown Bags Gangsters & Extradites Fugitives
The Haryana Police are successfully dismantling major criminal syndicates through their...
By Lokeshwari Panthadi 2026-07-04 08:38:36 0 88
Telangana
గుట్కా ఉమ్మడం, ప్రాణం తీసింది.
కిటికీ నుండి ఉమ్మి వేస్తున్న క్రమంలో మరో వాహనం ఢీకొట్టింది కర్ణాటక ఆర్టీసీ బస్సు  లోని...
By Bheeshman King 2026-07-03 12:23:11 0 335
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో మాట నిలబెట్టుకున్న హెచ్ఎం
బి.కొత్తకోట మండలంలోని గొళ్లపల్లి ZP హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న చందన, వరుణ్‌లు 555...
By Pagadala Venkateswar 2026-05-28 05:27:30 0 113
Telangana
మార్చి నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ విజయవంతం – పోలీసు అధికారులకు ప్రశంస పత్రాల అందజేత
మార్చి నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా, జిల్లా...
By Pinnehasan Odela 2026-04-08 15:24:50 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com