గోపాల్ నగర్ ప్రధాన రహదారి సమస్యను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా కృషి చేస్తాను: బండి రమేష్

0
225

 

 

హైదరాబాద్, కుక్కట్ పల్లి, గోపాల్‌నగర్ మెయిన్ రోడ్ ప్లాట్ యజమానుల విజ్ఞప్తి మేరకు శ్రీ బండి రమేష్ గారు ఈరోజు గోపాల్‌నగర్ ప్రధాన రహదారిని సందర్శించి, అక్కడి ప్లాట్ యజమానులతో సమావేశమై వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ప్లాట్ యజమానులు మాట్లాడుతూ, గోపాల్‌నగర్ లేఅవుట్ 1980లో ఏర్పడిందని, 1981లో ప్లాట్లను కొనుగోలు చేశామని తెలిపారు. అప్పట్లో ఆమోదించబడిన లేఅవుట్‌లో ప్రధాన రహదారి వెడల్పు 40 అడుగులుగా మాత్రమే ఉందని, తమ వద్ద ఉన్న అన్ని రిజిస్టర్డ్ అమ్మకపు పత్రాల్లో (Sale Deeds) కూడా 40 అడుగుల రహదారే నమోదై ఉందని వివరించారు.మూసాపేట నుండి లింగంపల్లి వరకు ఇదే రహదారి అనేక ప్రాంతాల్లో 60 నుండి 80 అడుగుల వెడల్పుతో మాత్రమే ఉందని, అలాంటప్పుడు గోపాల్‌నగర్ ప్రాంతంలో మాత్రమే 120 అడుగుల రహదారి పేరుతో భూములను సేకరించడం పూర్తిగా అన్యాయమని తెలిపారు.ఈ సమస్య గత 40 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా కొనసాగుతోందని, చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ప్లాట్ యజమానుల హక్కులను ప్రభుత్వం పరిరక్షించాలని వారు శ్రీ బండి రమేష్ గారిని కోరారు.

ప్లాట్ యజమానుల వినతిని, సంబంధిత పత్రాలను పరిశీలించిన అనంతరం శ్రీ బండి రమేష్ గారు సమస్య తీవ్రతను గుర్తించి, సంబంధిత అధికారులతో చర్చించి ఈ సమస్యకు వీలైనంత త్వరగా న్యాయమైన పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

గోపాల్‌నగర్ మెయిన్ రోడ్ ప్లాట్ యజమానులు ఈ సందర్భంగా శ్రీ బండి రమేష్ గారికి తమ సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించి భరోసా కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ బాబు, వినోద్ చావా, శ్రీనివాస్, తిలక్, అనిల్, సుధాకర్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ బాబు
పుంగనూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా సీనియర్ న్యాయవాది...
By Kothuru Murali 2026-03-17 07:06:10 0 201
Andhra Pradesh
వినికిడి యంత్రం కోసం PGRS లో విన్నతి – స్పందించిన అధికారులు
వినికిడి యంత్రం కోసం PGRS లో విన్నతి – స్పందించిన అధికారులుజిల్లా :బాపట్ల|మండలం :వేమూరు|...
By Gadiyapudi Narendra 2026-01-03 09:22:39 0 277
Karnataka
Bengaluru’s KIA Named World’s 3rd Most Family-Friendly Hub
Bengaluru’s Kempegowda International Airport (KIA) has achieved global acclaim, securing...
By Lokeshwari Panthadi 2026-06-29 06:00:49 0 84
Andhra Pradesh
వైయస్ షర్మిల రెడ్డి APCC చీఫ్ కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు
scroll    విజయవాడ    *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC చీఫ్    -...
By Rajini Kumari 2025-12-28 09:46:26 0 219
SURAKSHA
ప్రమాద రహిత రోడ్లే లక్ష్యం: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు నిరంతరం తనిఖీలు...
By Kalaga Sailaja 2026-06-25 06:47:13 0 86
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com