జులై 19న కోస్గిగి లో వాల్మీకుల సదస్సు

0
142

 

వాల్మీకుల ఎస్టీ హక్కుల సాధన లక్ష్యంగా ఈ నెల 19న కోసిగి పట్టణంలో నిర్వహించనున్న వాల్మీకి చైతన్య సదస్సును విజయవంతం చేయాలని వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీ రామ్ భీం నాయుడు పిలుపునిచ్చారు.

 

శుక్రవారం కోసిగిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని కోసిగి, కౌతాళం, పెద్దకడుబూరు, మంత్రాలయం మండలాలకు చెందిన వాల్మీకి కుటుంబాలు పెద్ద ఎత్తున ఈ సదస్సుకు హాజరుకావాలని కోరారు. ఈ సదస్సు వాల్మీకుల సామాజిక, విద్యా, ఆర్థిక అభ్యున్నతికి దిశానిర్దేశం చేసే వేదికగా నిలుస్తుందని తెలిపారు.

 

దశాబ్దాలుగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఉద్యమాలు, వినతులు, నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఆశించిన ఫలితాలు సాధ్యం కాలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో వాల్మీకుల డిమాండ్‌కు అనుకూల వాతావరణం నెలకొన్నదని పేర్కొన్నారు.

 

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మరోసారి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి, వాల్మీకులకు ఎస్టీ హోదా కల్పించేందుకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది వాల్మీకులు ఉన్నారని, వారికి ఎస్టీ హోదా కల్పించబడితే విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధి రంగాల్లో విశేష అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ దిశగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుంటే వాల్మీకుల చిరకాల ఆకాంక్ష నెరవేరుతుందని అన్నారు.

 

వాల్మీకుల భవిష్యత్తు తరాల అభ్యున్నతి కోసం నిర్వహిస్తున్న ఈ చైతన్య సదస్సుకు రాజకీయాలకు అతీతంగా ప్రతి వాల్మీకి కుటుంబం భాగస్వామ్యం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

ఈ సమావేశంలో వాల్మీకి సంఘం నాయకులు జ్ఞానేశ్, హనుమంతు, నాగేష్, దిద్ది నాగేష్, హనుమన్న, వెంకటేష్, బసవరాజు, వెంకటరాముడు, గోపాల్, గాదిరెడ్డి, అనుమప్ప తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పాత వైద్య విధానాన్ని అమలు చేయాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద గురువారం ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్...
By Kothuru Murali 2026-05-21 18:14:34 0 118
Telangana
Malkajgiri’s Pride: A Tribute to the Fearless Leader Eatala Rajender!|
Malkajgiri : A Leader of the Masses: Celebrating the Spirit of Eatala Rajender on His Birthday...
By Sidhu Maroju 2026-03-20 11:01:37 0 416
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని వినాయక ఉత్సవాలు సోమప్ప సర్కిల్లో
ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో వినాయకుల నిమజ్జనానికి బయలుదేరేటప్పుడు భారీ బాణసంచాలతో...
By Boya Dasthagiri 2026-09-17 00:51:20 0 71
SURAKSHA
: Police Personnel Actively Participate in the Yoga Andhra 2026 Campaign
As part of the statewide "Yoga Andhra 2026" initiative, police personnel are actively...
By Kalaga Sailaja 2026-06-30 13:13:54 0 279
Andhra Pradesh
పుంగనూరు:హైవేపై రోడ్డు ప్రమాదం కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్దగల హైవేపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది....
By Kothuru Murali 2026-05-22 14:18:09 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com