అభివృద్ధి పనులు చేసేది కేంద్రం. మా ప్రభుత్వమే చేస్తుందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

0
1K

 నడిచే సిసి రోడ్డు, పారే కాలువ, పెరిగే మొక్కలు, తినే బియ్యం మా ప్రభుత్వ పథకాలే అని, కాంగ్రెస్ చెప్పుకోవడాలు మాత్రమే, నిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వానివే అని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం అల్వాల్ పట్టణ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో బిజెపి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా రోడ్లు, రైల్వే గేట్ల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నివారణకు రైల్వే ట్రాక్ ల వద్ద ఆర్యూబీలు, ఆర్ఓబీలు, జాతీయ రహదారులు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన అభివృద్ధి పనులు అని ఆయన తెలిపారు. మచ్చ బొల్లారం డివిజన్ పరిధి తురకపల్లి, బొల్లారం రైల్వే గేటు వద్ద, జనప్రియ హోమ్స్ వద్ద ప్రజల ఇబ్బందులను గుర్తించి ఆర్ యు బి నిర్మాణాల కోసం పార్లమెంట్ లో కొట్లాడి నిధులు మంజూరు చేయించడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం జరిగిందని చెప్పుకోవడమే తప్ప నిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వానివేనని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో, మేడ్చల్ జిల్లాలో వేలకోట్ల వ్యయంతో నిధులు మంజూరు చేయించి రైల్వే స్టేషన్ లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. కెసిఆర్ గానీ రాష్ట్ర ప్రభుత్వాల నాయకులు గానీ మేము చేశాం అని చెప్తారు కానీ, ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెడుతున్నామని ఒక్కరు చెప్పడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం నేను సేవకున్ని, మీ సేవ చేస్తున్నానని చెప్తున్నారు కానీ, నేనే చేశానని ఎక్కడ చెప్పిన సందర్భాలు లేవని ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు మల్లారెడ్డి, చింతల మాణిక్య రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, మహిపాల్ రెడ్డి, గోపు రమణారెడ్డి, దండుగుల వెంకటేష్, శ్రీకాంత్ గౌడ్, అజయ్ రెడ్డి, మోయి సుజాత, కరుణశ్రీ, పద్మిని, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నగరంలోని శ్రీ లక్ష్మి కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి
కర్నూలు జిల్లాల గ్రామీణ వైద్యుల మహాసభ లో రాష్ట్ర మంత్రి టీజి భరత్ , తెలుగుదేశం పార్టీ పొలిట్...
By mahaboob basha 2025-07-16 15:17:32 0 882
Telangana
మౌళిక వసతుల కల్పనలో కుత్బుల్లాపూర్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా / కుత్బుల్లాపూర్    జగద్గిరిగుట్ట డివిజన్ 126 పరిధి బీరప్ప...
By Sidhu Maroju 2025-08-07 09:22:33 0 627
Andhra Pradesh
అల్పపీడన ప్రభావంతో వర్షాల విరుచుకుపాటు |
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు...
By Bhuvaneswari Shanaga 2025-10-23 04:50:43 0 48
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com