సరైన సమయంలో వైద్య సేవలు అందక గిరిజన యువత మృతి!

0
188

చింతూరు డివిజన్ ఏజెన్సీ మారుమూల గిరిజన ప్రాంతం కర్మన్ కొండ లో గత మూడురోజుల క్రితం పాముకాటుకు గురైన యువతి సూట్రు సమ్మక్క ప్రియ (18) సంవత్సరాలు డోలిమోతతో కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో చికిత్స నిమిత్తం చేర్పించినా సంగతి విదితమే. ఈరోజు సమ్మక్క ప్రియ విజయవాడ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. వివరాల ప్రకారం పాముకాటు వేసిన సోమవారం రాత్రి చికిత్స కోసం కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో చేర్పించగా వైద్యులు అందుబాటులో లేకపోవడం వలన చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి విషమించడంతో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు అక్కడ కూడా పరిస్థితి విషమంగానే ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ సమ్మక్క ప్రియా ఆరోగ్యం విషమించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. సమ్మక్క ప్రియ మరణ వార్త వినగానే కళాశాల స్నేహితులు గ్రామస్తులు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమాయకపు ఆదివాసి గిరిజనులు సరైన వైద్య సేవలు లేక ఇలా అనేకమంది చింతూరు డివిజన్ ఏజెన్సీలో మరణించిన కథనాలు అనేకం,ఇప్పటికైనా ప్రభుత్వం గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అనేక గిరిజన సంఘాలు ప్రభుత్వాన్ని కోతున్నాయి.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
2025 లో సామాన్యుడిపై ప్రభావం చూపిన ఆర్థిక మార్పులు ఇవే
*2025లో సామాన్యుడి జేబుపై ప్రభావం చూపిన ఆర్థిక మార్పులు ఇవే*   2025లో చాలా ఆర్థిక మార్పులు...
By Rajini Kumari 2025-12-29 13:07:22 0 228
Andhra Pradesh
పుంగనూరులో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన
పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల...
By Kothuru Murali 2026-02-28 10:28:09 0 173
Andhra Pradesh
జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన శ్రీమతి బుట్టా రేణుక
ఎమ్మిగనూరు ప్రాంతానికి చెందిన వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీల చేనేత వస్త్ర విక్రయ కేంద్రాలను...
By Boya Dasthagiri 2026-03-28 23:49:06 0 418
Karnataka
New Alcohol-in-Beverage Tax Structure Rolls Out
Karnataka has implemented a pioneering Alcohol-in-Beverage (AIB) excise policy, shifting taxation...
By Dunna Jessicaruth 2026-05-18 06:43:58 0 82
Andhra Pradesh
రోడ్డు భద్రతపై కురుపాం పోలీసుల అవగాహన
కురుపాం పోలీసుల ఆధ్వర్యంలో సాయిబాబా గుడి సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించి వాహనదారులకు రోడ్డు...
By Boiena Rajesh 2026-08-26 11:19:05 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com