దేవాదుల ప్రాజెక్టు భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి

0
191

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి

హనుమకొండ, జూలై 8:జే. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ పురోగతిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ బుధవారం న్యూఢిల్లీ నుంచి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొని, భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.

హనుమకొండ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి, జిల్లాలో దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం మిగిలి ఉన్న సుమారు 42.34 ఎకరాల భూమి సేకరణకు వేగవంతమైన చర్యలు చేపట్టామని, సంబంధిత రైతులతో సమన్వయం చేస్తూ భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.

ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో హనుమకొండ నుంచి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, పర్యవేక్షకులు జగత్ సింగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రేపు కోల్‌కతాకు సీఎం చంద్రబాబు... బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరు.
రేపు ఉదయం విజయవాడ నుంచి కోల్‌కతాకు బయల్దేరనున్న ముఖ్యమంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,...
By Pagadala Venkateswar 2026-05-08 05:40:55 0 142
Andhra Pradesh
మదనపల్లెలో ఇరువర్గాల ఘర్షణ.. తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లెలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తిరుపతికి చెందిన...
By Pagadala Venkateswar 2026-04-20 03:22:04 0 139
Andhra Pradesh
2026 అంతర్జాతీయ యువత లేఖారచన పోటీ తేదీ మార్పు.
కడప డివిజన్ తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 2026 అంతర్జాతీయ యువత లేఖారచన పోటీ తేదీ మారినట్లు...
By Pagadala Venkateswar 2026-02-12 04:39:43 0 366
SURAKSHA
Haryana Police Dial-112 Cuts Response Time to 7 Minutes
The Haryana Police are setting a new benchmark in public safety with their integrated Emergency...
By Lokeshwari Panthadi 2026-07-04 08:27:36 0 154
Andhra Pradesh
మైనర్ బాలురు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులే బాధ్యులని ఆయన హెచ్చరించారు
పుంగనూరు పట్టణంలో సీఐ సుబ్బరాయుడు, సిబ్బంది కలిసి శనివారం వాహనాల తనిఖీని నిర్వహించారు. జిల్లా...
By Kothuru Murali 2026-01-11 08:11:50 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com