అల్వాల్‌లో 20 సీసీ కెమెరాల ప్రారంభం.|

0
140

"మల్కాజ్‌గిరి సీపీ బి. సుమతి ఐపీఎస్ ఆదేశాలతో నిఘా వ్యవస్థ విస్తరణ.. ఏసీపీ గోపాలకృష్ణమూర్తి సమక్షంలో ప్రారంభించిన ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్"

మేడ్చల్ మల్కాజ్గిరి జులై 6 (భారత్ ఆవాజ్):మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా సోమవారం సెక్టార్-1లోని మనసరోవర్ హైట్స్ సమీపంలోని సముద్రా సింఫనీ అపార్ట్‌మెంట్స్‌లో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను బేగంపేట్ డివిజన్ ఏసీపీ గోపాలకృష్ణమూర్తి సమక్షంలో అల్వాల్ ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో సెక్టార్ ఎస్‌ఐ చంద్రశేఖర్ తో పాటు సీసీటీవీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏసీపీ గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతో సీసీటీవీ నెట్‌వర్క్‌ను విస్తరించడం వల్ల నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాగుతుందన్నారు. నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తులో మాత్రమే కాకుండా, నేరాలను ముందుగానే నిరోధించడంలో కూడా సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి అపార్ట్‌మెంట్, వాణిజ్య సముదాయం, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు సామాజిక భద్రతను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

అల్వాల్ ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ మాట్లాడుతూ, సాంకేతికతను సమర్థంగా వినియోగించడం ద్వారా పోలీసింగ్‌ను మరింత ప్రజలకు చేరువ చేస్తున్నామని అన్నారు. సీసీ కెమెరాల ద్వారా అనుమానాస్పద కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, నేరాలకు పాల్పడే వ్యక్తులను వేగంగా గుర్తించడం, దర్యాప్తును సులభతరం చేయడం సాధ్యమవుతుందన్నారు. ప్రజల సహకారంతో సీసీటీవీ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించే దిశగా అల్వాల్ పోలీసులు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

సీసీటీవీ నెట్‌వర్క్ విస్తరణకు సహకరించిన జూడియో మాల్ యాజమాన్యాన్ని పోలీసులు అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల భద్రతను మరింత పటిష్ఠం చేయడంతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్‌కు మరింత బలం చేకూరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
శరవేగంగా శంకర్ విలాస్ ఆర్‌ఓబి పనులు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు నగర అభివృద్ధిలో కీలకమైన శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబి) నిర్మాణ పనులను...
By John Baji 2026-01-02 12:14:55 0 245
Andhra Pradesh
మచిలీపట్నంలో డిజిటల్ అరెస్టుపై వృద్ధ దంపతులను టార్గెట్
కృష్ణాజిల్లా   మచిలీపట్నంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధులను మోసం చేసే యత్నం   ...
By Rajini Kumari 2026-02-28 12:49:35 0 181
Telangana
ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన భారత ఆవాజ్ రిపోర్టర్ రవి మహంకాళి
నిన్నా రాత్రి సమయంలో టిప్పర్ లారీ శరవేగానికి. బైక్ మీద వెళ్తున్నా ఒక యువకుడి బైక్ గుద్ది...
By Mahankali Ravi 2026-04-21 10:04:49 0 440
Telangana
అల్వాల్ చెరువు కట్ట పైన లైట్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:  అల్వాల్ చెరువు కట్ట పరిధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు....
By Sidhu Maroju 2025-08-19 15:43:53 0 639
Andhra Pradesh
PDS బియ్యం అక్రమంగా తరలిస్తున్న రేండు వాహనాలు స్వాధీనం, 6 టన్నుల PDS బియ్యం పట్టివేత.
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ...
By John Baji 2026-01-12 14:17:57 0 257
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com