గ్రంథాలయంలో బాబు జగజీవన్ కు ఘన నివాళి
Posted 2026-07-06 16:45:35
0
257
నందిగామ జూలై 6 భారత్ అవాజ్ : నందిగామ శాఖ గ్రంథాలయంలో భారత మాజీ ఉపప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబూ జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి అల్లూరు రామచంద్రుడు బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, 1908 ఏప్రిల్ 5న జన్మించిన బాబూ జగ్జీవన్‌రామ్ భారత ఉపప్రధానిగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా విశిష్ట సేవలు అందించారని, కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. అందరూ ప్రేమగా "బాబూజీ" అని పిలిచే ఆయన 1986 జూలై 6న పరమపదించారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు గోపాలకృష్ణ, నరేంద్ర, విద్యార్థులు పాల్గొని బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Srikant Nagulapalli, IAS: Leading Digital Governance
A Visionary Civil Servant Leading Innovation, Public Policy, and Citizen-Centric Administration...
అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్ నిశాంత్ కుమార్.
మదనపల్లిలో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS)లో జిల్లా కలెక్టర్ నిశాంత్...
కార్యకర్తలకు కేంద్రమంత్రి అండ.. సొంత డబ్బుతో ఇళ్ల నిర్మాణం.
కార్యకర్తలకు కేంద్రమంత్రి అండ.. సొంత డబ్బుతో ఇళ్ల నిర్మాణం
12-06-2026 Fri ...
Cm revanth reddy congratulated narimallia pravalika
చైనాలోని ఒర్డోస్‌లో జరిగిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల...
డ్రగ్స్ రహిత సమాజమే మా లక్ష్యం
*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*
*పత్రికా ప్రకటన*...