గ్రంథాలయంలో బాబు జగజీవన్ కు ఘన నివాళి

0
253

నందిగామ జూలై 6 భారత్ అవాజ్ : నందిగామ శాఖ గ్రంథాలయంలో భారత మాజీ ఉపప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబూ జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి అల్లూరు రామచంద్రుడు బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, 1908 ఏప్రిల్ 5న జన్మించిన బాబూ జగ్జీవన్‌రామ్ భారత ఉపప్రధానిగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా విశిష్ట సేవలు అందించారని, కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. అందరూ ప్రేమగా "బాబూజీ" అని పిలిచే ఆయన 1986 జూలై 6న పరమపదించారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు గోపాలకృష్ణ, నరేంద్ర, విద్యార్థులు పాల్గొని బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మార్వో మరియుఆర్ అండ్ బి అధికారులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, జె టౌన్ సమీపంలో 42వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన...
By Kothuru Murali 2026-01-03 11:14:01 0 225
Andhra Pradesh
డ్రంకెన్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలుశిక్ష
డ్రంకెన్ డ్రైవ్ కేసులో బొబ్బిలి మండలం జగన్నాథపురానికి చెందిన వ్యక్తికి మూడు రోజులు జైలుశిక్ష...
By Boiena Rajesh 2026-07-23 08:08:14 0 172
Telangana
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఈటల, మల్లారెడ్డి.. కారణం ?
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ డంపింగ్‌ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని సీఎం...
By Ponnala Srinivasrao 2026-05-05 01:44:39 0 165
SURAKSHA
Triumph Over Silence: The Inspiring Saga of IAS Mani Ram Sharma
Defying All Odds: How a Boy Who Lost His Hearing Became an IAS Officer: True resilience is not...
By Kalaga Sailaja 2026-07-21 07:24:50 0 139
SURAKSHA
Empowering Our Daughters: Self-Defense & Police Training
Arunachal Pradesh Police is taking bold steps toward fostering gender sensitivity and community...
By Lokeshwari Panthadi 2026-07-04 09:08:56 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com