బాబూ జగ్జీవన్ రామ్‌కు ఎమ్మెల్యే శ్రీగణేష్ నివాళి.!
Posted 2026-07-06 09:50:35
0
131
"పికెట్‌లోని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి"
మేడ్చల్ మల్కాజిగిరి : భారత మాజీ ఉపప్రధాని, నవభారత నిర్మాత బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పికెట్‌లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశ రాజకీయాలు, సామాజిక సేవలో బాబూ జగ్జీవన్ రామ్ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అణగారిన, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవానికి విశేష కృషి చేసి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ పిలుపునిచ్చారు.
#Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madanapalle: మదనపల్లె సమీపంలోని చిప్పిలి వద్ద ట్రాఫిక్ ఎస్ఐ గాయత్రి వాహనాల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మదనపల్లె, జూలై 27: అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని చిప్పిలి వద్ద ట్రాఫిక్ ఎస్ఐ గాయత్రి...
పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్
మీడియా పాయింట్...
పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్...
పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపకండి: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy
గొల్లపల్లి దాడితల్లి సిరిమాను చెట్టు కొట్టిన బేబినాయన
గొల్లపల్లి దాడితల్లి గ్రామ దేవత పండగ ఏప్రిల్ 26, 27, 28న జరగనుంది. ఈ నేపథ్యంలో సిరిమనోత్సవానికి...