మల్కాజిగిరి కమిషనరేట్‌కు అంబులెన్స్ అందజేత.|

0
102

"అల్లూరి జయంతి వేడుకల్లో ప్రజాసేవకు మరో తోడ్పాటు"

హైదరాబాద్,జూలై 4:మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు అంబులెన్స్‌ను విరాళంగా అందజేశారు.

ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో లక్ష్మీ అంబులెన్స్ సర్వీస్ అందించిన అంబులెన్స్‌ను మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ తరఫున మల్కాజిగిరి ట్రాఫిక్ ఏసీపీ పి. సుబ్బయ్య స్వీకరించారు. పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో సేవలు అందించాలనే ఉద్దేశంతో అందించిన ఈ అంబులెన్స్‌ను కమిషనరేట్ పరిధిలో వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా అంబులెన్స్‌ను విరాళంగా అందించిన తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితి, లక్ష్మీ అంబులెన్స్ సర్వీస్‌కు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Puducherry
Puducherry Expands Healthcare and Public Health Services
Puducherry is enhancing its healthcare infrastructure through investments in hospitals, primary...
By Fathima Safa 2026-06-18 11:37:42 0 281
Andhra Pradesh
రాష్ట్రవ్యాప్తంగా హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమం
*For Scrolls*   *చీపురుపల్లి*   *రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్...
By Rajini Kumari 2026-02-28 12:44:31 0 187
Andhra Pradesh
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ*   *కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ*...
By Rajini Kumari 2025-12-19 10:14:05 0 258
Telangana
నిజామాబాద్. జిల్లా కాలేక్టెర్ 10 వతరగతి పరీక్షా కేంద్రాలు అ కాస్మికథానికి
నిజామాబాద్.సోమావరం 10 వాతరగతి పరిక్షలను పరదర్శకంగా నిర్వహించాలని జిల్లా కాలెక్టర్ ఈ లా త్రిపట్టి...
By Sadaq Sadaq 2026-03-23 18:22:03 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com