మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం

0
2K

*_ఒకే కుటుంబానికి చెందిన 9మంది దుర్మరణం_* *_మధ్యప్రదేశ్​ రాష్ట్రంలో ఝబువా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్ సమీపంలో ముందు నుంచి వస్తున్న వ్యాన్​ను లారీ ఢీకొట్టింది._* *_ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందారు, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు._* *_బాధితులు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, వీరంతా వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది._* *_మేఘ్​నగర్ తహసీల్​ ప్రాంతంలోని సంజెలి రైల్వే క్రాసింగ్ సమీపంలోని తాత్కాలిక రహదారి నిర్మాణం జరుగుతుంది._* *_ఈ క్రమంలో ఓవర్​- బ్రిడ్జ్​ని సిమెంట్ లోడ్​తో ఉన్న లారీ దాటుతుండగా అదుపు తప్పి ప్యాసింజర్స్​ ఉన్న వ్యాన్​పై బోల్తా పడిందని ఝబువా సూపరిటెండెంట్​ పద్మవిలోచన్ శుక్లా తెలిపారు._* *_ఈ ప్రమాదంలో 9మంది మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. దీంతో వ్యాన్ పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు._* *_మృతుల్లో నలుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. చనిపోయిన వారిలో ముఖేష్ (40), సావ్లి (35), వినోద్ (16), పాయల్ (12), మధి (38), విజయ్ (14), కాంత (14 ), రాగిణి (9), అకాలి (35), పాయల్ సోమ్లా పర్మార్ (19 ), అషు (5 ) ఉన్నారు._* *_ఘటన జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన వారితో పాటు మృత దేహాలను పోలీసులు ఆస్పత్రులకు తరలించారు._*

Search
Categories
Read More
Telangana
భారీగా తగ్గిన చికెన్ ధరలు
గత వారంతో పోలిస్తే ఇవాళ చికెన్ ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో నిన్న మొన్నటి వరకు కేజీ స్కిన్...
By Prashanth Goindla 2026-03-29 02:00:39 0 222
Andhra Pradesh
అధికారులు డ్రైనేజీ సమస్యను పరిష్కరించండి
డ్రైనేజీ  సమస్యను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించండి..! రాకపోకలకు తీవ్ర అంతరాయం లేకుండా...
By Patan Khuddus 2026-04-19 15:07:20 0 432
Telangana
అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే శ్రీగణేష్
కంటోన్మెంట్ వార్డు 1 లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ 60 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు....
By Sidhu Maroju 2025-07-10 05:53:41 0 1K
Andhra Pradesh
విజయవాడలో మహిళ దారుణ హత్య
*_విజయవాడలో మహిళా దారుణ హత్య.._*   విజయవాడ రెండో పట్టణం గవర్నర్ పేట వద్ద మహిళను గొంతు కోసి...
By Rajini Kumari 2026-04-14 09:19:12 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com