రూ.31 లక్షల వర్షపు నీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం.|

0
108

"మోండా డివిజన్‌లో మూడు ప్రాంతాల్లో అభివృద్ధి పనుల ప్రారంభం"

మేడ్చల్ మల్కాజిగిరి: కంటోన్మెంట్ నియోజకవర్గంలో వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే లక్ష్యంతో మోండా డివిజన్‌లో రూ.31.10 లక్షల వ్యయంతో వర్షపు నీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం భూమిపూజ చేసి శ్రీకారం చుట్టారు.

ఈ పనుల్లో భాగంగా అల్లాడి పెంటయ్య నగర్‌లో రూ.9.50 లక్షలతో 200 మీటర్లు, డొక్కాలమ్మ టెంపుల్ ప్రాంతంలో రూ.9.10 లక్షలతో 200 మీటర్లు, కుమ్మరిగూడలో రూ.12.50 లక్షలతో 250 మీటర్ల మేర మొత్తం 650 మీటర్ల పొడవున రెయిన్‌వాటర్ పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ, వర్షాల సమయంలో ఈ ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 

సమస్యను గుర్తించి వెంటనే నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. పనులను నిర్దేశిత గడువులోగా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, దశలవారీగా ప్రజా సమస్యలకు పరిష్కారం చూపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : గడ్డి మందు తాగిన యువకుడు మృతి
పుంగనూరు నియోజక వర్గం, చౌడేపల్లి మండలం, చిట్టిరెడ్డిపల్లి గ్రామంలో కాపురం ఉంటున్న సతీష్ (25)...
By Kothuru Murali 2026-01-29 08:54:41 0 206
Telangana
Tomorrow banks strike
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 11న...
By G k Nookala 2026-09-10 16:29:27 0 125
SURAKSHA
"Kevithuto Sophie, IPS: Leading Nagaland's Armed Police Force"
A seasoned 2011-batch IPS officer of the Nagaland Cadre, Kevithuto Sophie has risen from the...
By Lokeshwari Panthadi 2026-07-28 09:06:17 0 194
Andhra Pradesh
నేడు విజయవాడ సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో బాబురావు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాథ్ పాల్గొన్నారు
*విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించకపోతే కనెక్షన్ల తొలగిస్తామని సర్కార్ నోటీసులు*  ...
By Rajini Kumari 2025-12-17 09:19:12 0 263
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : షేర్ ఆటో బోల్తా పడి ఇద్దరి పరిస్థితి విషమం
శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, గడ్డం వారిపల్లి సమీపంలో ఫోన్ మాట్లాడుతూ ఆటో...
By Kothuru Murali 2026-01-31 16:03:17 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com