ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

0
1K

అల్వాల్ సర్కిల్ పరిధిలోని చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, జాతీయ జెండాను, ఆవిష్కరించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల ఫలితమే మనకు తెలంగాణ ఏర్పడిందని, వారందరిని గుర్తు చేసుకుంటూ, వారి ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎంతో ముందుకు తీసుకెళ్లిన మన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అమర వీరులను గుర్తు చేసుకుంటూ వారి ఆశయాల సాధనకై మునుముందు రాష్ట్ర అభివృద్ధి కొరకై నిరంతరం కృషి చేయాల్సిందిగా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్ గౌడ్, తెలంగాణ ఉద్యమకారులు, నాయకులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించిన ఈశ్వరీ భాయి 107వ జయంతి వేడుకలు.|
హైదరాబాద్ :  తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ, మరియు ఈశ్వరీ బాయి మెమోరియల్ ట్రస్ట్...
By Sidhu Maroju 2025-12-01 16:20:24 0 94
Legal
Supreme Court Dismissed Lalit Modi's Plea
The Supreme Court on Monday dismissed a plea by former cricket administrator Lalit Modi, who had...
By Bharat Aawaz 2025-07-03 08:45:12 0 2K
Andhra Pradesh
విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి వేడుకలు జనసేన కార్యాలయం భవానిపురం లో ఘనంగా నిర్వహించారు
విజయవాడ, NTR జిల్లా,  భవానిపురం    స్వతంత్ర సమరయోధుడు ,ఆమరజీవి పొట్టి...
By Rajini Kumari 2025-12-15 11:05:34 0 43
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com