గోషామహల్‌లో డబుల్ బెడ్‌రూం పట్టాల పంపిణీ.|

0
127

"మంత్రులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్"

హైదరాబాద్  గోషామహల్ నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రుల చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ మంత్రులు, రాజ్యసభ సభ్యుడు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.

అనంతరం మాట్లాడిన మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. 

ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు అందిస్తామని, ప్రజాపాలనలో సంక్షేమానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Mizoram
Mizoram Launches NID Pulse Polio Immunisation Drive
The government of Mizoram has officially launched its National Immunisation Day (NID) Pulse Polio...
By Lokeshwari Panthadi 2026-07-02 06:31:43 0 108
Andhra Pradesh
క్రీడాస్ఫూర్తితో విద్యార్థులు ఎదగాలి: చల్లపల్లి నరసింహరెడ్డి.
మదనపల్లె మండలం, గంగన్నగారిపల్లెలోని శ్రీ కృష్ణ చైతన్య ఫార్మసీ, నర్సింగ్ కళాశాలలో వార్షిక...
By Pagadala Venkateswar 2026-01-23 06:46:25 0 226
Andhra Pradesh
డ్రగ్స్ పై దండయాత్ర
*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*   *పత్రికా ప్రకటన* *తేదీ....
By Rajini Kumari 2026-02-02 17:13:02 0 226
Andhra Pradesh
యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.
  యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌  ...
By Pagadala Venkateswar 2026-06-21 07:44:45 0 97
Telangana
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడం వల్ల సమస్యలు ఉత్పన్నం. ఎమ్మెల్యే శ్రీ గణేష్.
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడం వల్ల కాలనీలలో చిన్న చిన్న సమస్యలు కూడా...
By Sidhu Maroju 2025-06-04 17:11:41 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com