కౌన్సిలర్ కార్తీక్ చొరవతో కదిలిన యంత్రాంగం సందీప్ నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ

0
272

🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్, జూలై 01:ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు సందీప్ నగర్ కాలనీలో దీర్ఘకాలంగా వేధిస్తున్న తాగునీటి కొరత, కల్వర్ట్ నిర్మాణ సమస్యలకు త్వరలోనే మోక్షం లభించనుండగా, స్థానిక కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ ప్రజల ఇబ్బందులను రాతపూర్వక వినతి ద్వారా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు వేగంగా కదిలారు. దీనిపై తక్షణమే స్పందించిన కమిషనర్ గారు, డీఈ మేడం, శానిటరీ ఇన్‌స్పెక్టర్, 1వ వార్డు కౌన్సిలర్ వినోద్ మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి నేరుగా కాలనీలో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా సమీక్షించారు. అక్కడ ఉన్న సమస్యల తీవ్రతను గుర్తించిన కమిషనర్, సంబంధిత విభాగాల అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం తపిస్తూ తక్షణ పరిష్కారానికి చొరవ చూపిన కౌన్సిలర్ రాపర్తి కార్తీక్‌కు, అలాగే సానుకూలంగా స్పందించి కాలనీని సందర్శించి పనులకు హామీ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్‌తో పాటు పాల్గొన్న మున్సిపల్ అధికారులందరికీ సందీప్ నగర్ కాలనీ ప్రజలు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల...
By Sadaq Sadaq 2026-08-15 06:31:45 0 115
Andhra Pradesh
పుంగనూరు: ప్రమాదంలో గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, రాంపల్లి గ్రామానికి చెందిన రామ్ చరణ్ (21) ఈనెల 19న ద్విచక్ర వాహనంపై...
By Kothuru Murali 2026-05-28 18:32:27 0 198
Telangana
బోనాల బాటలో బస్తీ బంధం..|
● అమ్మవారి దర్శనానికి రావాలని ఆహ్వానించిన బస్తీ నాయకులు ● కార్యక్రమంలో పాల్గొన్న పలువురు...
By Sidhu Maroju 2026-08-05 10:41:28 0 147
Andhra Pradesh
నేడు ఏపీ కేబినెట్ భేటీ ..ఈ కీలక అంశాలపై చర్చ.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో...
By Pagadala Venkateswar 2026-04-10 05:59:06 0 142
Telangana
Agricultural Growth and Farmer Welfare in Telangana
Telangana continues to strengthen its agricultural sector through various farmer welfare...
By Fathima Safa 2026-06-20 12:12:36 0 347
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com