నిజామాబాద్

0
114

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు

 

నిజామాబాద్: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

 

మొదట ఎల్లమ్మగుట్టలోని BRS పార్టీ జిల్లా కార్యాలయంలో, BRS పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ జీవన్ రెడ్డి గారితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం RR చౌరస్తా శివాజీ చౌక్‌లో సిర్ప రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

 

అలాగే జూబ్లీ హోటల్ చౌరస్తా, ఖిల్లా రోడ్‌లో BRS నాయకులు అబ్దుల్ మతీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించారు. 58వ డివిజన్ అధ్యక్షులు సమీ ఆధ్వర్యంలో దారుగల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

 

అనంతరం 15వ డివిజన్ BRS నాయకులు ముస్తాక్ ఆధ్వర్యంలో నిజాం కాలనీ మెయిన్ రోడ్, అర్సపల్లిలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను కూడా మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
టిడ్కో కాలనీల్లో మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయాలి: VZM కలెక్టర్
జిల్లాలోని అన్ని టిడ్కో కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని...
By Boiena Rajesh 2026-07-15 16:42:38 1 182
Goa
Rising Tensions: The Brewing Conflict Over Mhadei River Diversion
Panaji: The long-standing battle over the Mhadei River has intensified as the controversy over...
By Dunna Jessicaruth 2026-05-14 07:18:17 0 102
Andhra Pradesh
తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా
*చంద్రబాబు ఎన్నికల ఇచ్చిన హామీ ప్రకారంగా అర్హులైన నిరుపేదలకు పట్టణాల్లో 2 సెంట్లు,గ్రామీణ...
By Boya Dasthagiri 2026-03-24 23:59:00 0 346
Telangana
కొత్తపల్లి గ్రామ ప్రవేశ ద్వారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ
  పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ  నేడు పాలకుర్తి మండలంలోని కొత్తపల్లి...
By Avunoori Mahesh 2026-04-26 07:00:29 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com