ప్రతి ఓటు రక్షణే లక్ష్యం: శ్రీనివాస్ వర్మ.|

0
208

"అల్వాల్‌లో సీనియర్ సిటిజన్స్‌కు SIRపై అవగాహన సదస్సు"

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (ASCA) ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కే. శ్రీనివాస్ వర్మ పాల్గొని సీనియర్ సిటిజన్స్‌తో ముచ్చటించారు. ఎన్నికల సంఘం చేపట్టిన SIR కార్యక్రమం ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమని ఆయన పేర్కొన్నారు. 

ఓటరు జాబితా నుంచి ఒక్కరి పేరు కూడా అన్యాయంగా తొలగిపోకుండా ప్రతి ఓటును రక్షించేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేస్తారని తెలిపారు.

సీనియర్ సిటిజన్స్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంటింటికీ వెళ్లి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం  సీనియర్ సిటిజన్స్‌కు SIR దరఖాస్తు ఫారాలను ఎలా నింపాలి, ఏయే ధ్రువపత్రాలు సమర్పించాలి, సందేహాల నివృత్తికి అనుసరించాల్సిన విధానాలను వివరంగా తెలియజేశారు.

కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
జగన్ పేరులో 'జీ' అంటే 'జెన్ జీ' కాదు.. గొడ్డలి.. విధ్వంసమే ఆయన ఎజెండా: మంత్రి లోకేశ్‌.
    జగన్ పేరులో 'జీ' అంటే 'జెన్ జీ' కాదు.. గొడ్డలి.. విధ్వంసమే ఆయన ఎజెండా: మంత్రి...
By Pagadala Venkateswar 2026-06-12 11:06:16 0 132
Telangana
వరుణ దేవా కరుణించు వర్షాల కోసం బొడ్రాయికి ప్రత్యేక పూజలు
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జులై 10 సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ గ్రామస్తులు...
By Pindikura Mahesh 2026-07-11 02:49:23 0 378
Andhra Pradesh
శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాలు విందులో పాల్గొన్నా రాజంపే రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు గ్రామ పరిధిలోని నాగన్న గుట్ట పాలెం లో మంగళవారం...
By Benguluri Madhubabu 2026-03-24 11:56:22 0 254
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఐదు మండలాలకు 10 లక్షల కవర్లు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచర్ల మండలాల్లోని మామిడి...
By Kothuru Murali 2026-02-10 07:21:51 0 179
Punjab
Punjab Rolls Out ₹10 Lakh Health Cover for All 65 Lakh Families
Chief Minister Bhagwant Mann unveiled the Mukhyamantri Sehat Yojana on July 8, offering ₹10 lakh...
By Bharat Aawaz 2025-07-17 10:59:43 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com