ఓటరు నమోదు వేగవంతం.|

0
192

"బౌరంపేట్‌లో ప్రత్యేక ఓటరు సవరణ (SIR) కార్యక్రమాన్ని పరిశీలించిన కొలన్ హన్మంత్ రెడ్డి."

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 295వ డివిజన్ బౌరంపేట్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (Special Intensive Revision - SIR) ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి బూత్ లెవెల్ అధికారులతో (BLOలు) కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు నమోదు ప్రక్రియను బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ఓటరు జాబితాలో ఖచ్చితత్వం ఉండేలా అవసరమైన వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలు బీఎల్ఓలు అందించే ఎన్యుమరేషన్ ఫారమ్‌లను సక్రమంగా నింపి సమర్పించాలని, ముఖ్యంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న కొలన్ హన్మంత్ రెడ్డి, ప్రతి ఒక్కరూ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల జిల్లా లో వర్షాలు...నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం – రైతు కళ్లలో ఆనందం, పంటలపై కొత్త ఆశలు
మంచిర్యాల, జూలై 29: మంచిర్యాల జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు రైతుల ముఖాల్లో...
By Avunoori Mahesh 2026-07-29 04:19:04 0 190
Andhra Pradesh
తాడిపత్రి లో బైక్ ర్యాలీ
తాడిపత్రి పట్టణం లో హనుమాన్ జయంతి సందర్భంగా హిందూసోదరులు బైక్ ర్యాలీ నిర్వహించారు . ఇందులో ఆర్...
By Gitta Raju 2026-04-03 01:06:31 0 429
Tripura
Shift to Five-Day Workweek and WFH Phase-Out
In a major administrative overhaul, the Tripura Cabinet announced that all state government...
By Dunna Jessicaruth 2026-05-25 11:03:50 0 592
Tamilnadu
Tamil Nadu Accelerates Industrial Corridors and Logistics
Tamil Nadu continues to strengthen its industrial corridors and logistics network through major...
By Fathima Safa 2026-06-29 10:20:34 0 80
Telangana
2027 గద్దర్ అవార్డు లక్ష్యం గా నా "బతుకమ్మ " చిత్రం శ్రీను రావు పొన్నాల
తెలంగాణ ఆడ బిడ్డలు గర్వంగా  తలెత్తుకుని చూసే సినిమా ఈ సెప్టెంబర్‌లో వస్తుంది , తెలంగాణ...
By Ponnala Srinivasrao 2026-03-19 03:03:51 0 299
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com