""అరైవ్ అలైవ్".. చిన్నారులకు ట్రాఫిక్ భద్రత పాఠాలు.|

0
343

"ఆల్వాల్ కిడ్జ్ స్కూల్‌లో ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమం.. మైనర్ డ్రైవింగ్, అతివేగంపై హెచ్చరికలు."

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల నివారణకు చిన్న వయస్సు నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మల్కాజిగిరి పోలీసులు చేపట్టిన "అరైవ్ అలైవ్" కార్యక్రమానికి ఆల్వాల్‌లో విశేష స్పందన లభించింది. 

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, IPS ఆదేశాలు, ట్రాఫిక్-1 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె. రాహుల్ రెడ్డి, IPS మార్గదర్శకత్వంలో సోమవారం ఆల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిడ్జ్ స్కూల్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వివరిస్తూ, అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించడం వంటి ప్రమాదకర అలవాట్ల వల్ల సంభవించే దుష్పరిణామాలను ట్రాఫిక్ పోలీసులు వివరించారు. 

ముఖ్యంగా 18 ఏళ్లలోపు మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, సరైన వయస్సు వచ్చిన తర్వాత చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారే వాహనాలు నడపాలని విద్యార్థులకు స్పష్టంగా తెలియజేశారు.

అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీటుబెల్ట్ వినియోగించాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నళ్లను గౌరవించడం, లేన్ క్రమశిక్షణ పాటించడం, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించడం ద్వారా అనేక రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు.

కార్యక్రమంలో తిరుమల్ గిరి డివిజన్ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి. శంకర్ రాజు, ఆల్వాల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జి. పవన్ కుమార్, అదనపు ఇన్‌స్పెక్టర్ పి. హరి లాల్, సబ్-ఇన్‌స్పెక్టర్ కిషోర్, కిడ్జ్ స్కూల్ కరస్పాండెంట్ రవి రాజ్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

కార్యక్రమం అనంతరం విద్యార్థులు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతకు సంబంధించిన పలు సందేహాలను పోలీసు అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. 

ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం అభినందించగా, కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై భారీ ర్యాలీ.
అన్నమయ్య జిల్లా యంత్రాంగం ఆదివారం మదనపల్లెలో ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ...
By Pagadala Venkateswar 2026-01-25 12:40:19 0 213
Telangana
మన్ పిశాన్ "సినిమా బడ్జెట్"33 వేలల్లోనే ?
మన్ పిశాన్ అనే సినిమా 33 వేలల్లోనే తీశారని .. ఒకే రోజు షూటింగ్ లో పూర్తి చేసుకుందని నిన్న మొన్నటి...
By Ponnala Srinivasrao 2026-03-16 02:01:17 0 295
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం.
మదనపల్లె అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రమాణ...
By Pagadala Venkateswar 2026-06-18 05:11:20 0 207
Andhra Pradesh
పేద ప్రజల ఇళ్లకు ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించడం అన్యాయం
ప్రచురణార్థం.14/3/2026 విజయవాడ  పునరావాసం క్రింద సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ వెనుక ...
By Rajini Kumari 2026-03-14 11:26:44 0 225
Himachal Pradesh
Hydropower Projects and Renewable Energy Growth Drive
Himachal Pradesh is accelerating its clean energy transition through the expansion of hydropower...
By Fathima Safa 2026-06-22 11:05:31 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com