మందమర్రిలో బీఎల్ఎ-2 సమీక్ష సమావేశంలో మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి

0
277

మంచిర్యాల జిల్లా :  మందమర్రి పట్టణంలోని బి-1 కార్యాలయంలో నిర్వహించిన బీఎల్‌ఏ-2 సమీక్ష సమావేశంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, పలువురు పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఏ-2 ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి డా. వివేక్ వెంకటస్వామి బూత్ స్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయడం, బీఎల్‌ఏ-2 వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం, ఓటరు జాబితాపై నిరంతర పర్యవేక్షణ చేపట్టడం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశాలపై సమీక్ష నిర్వహించారు.ప్రతి బూత్‌లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేరవేస్తూ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
High Court: ‘మదనపల్లె’పై జోక్యం చేసుకోలేం
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చడాన్ని నిలువరించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.
By Pagadala Venkateswar 2026-01-08 07:38:58 0 212
Telangana
నేటి నుంచి చిలుకూరు ఆలయ బ్రహ్మోత్సవాలు
తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేడు సెల్వార్...
By Veeresh Kumar 2026-03-27 07:24:24 0 579
Telangana
నూతన బొడ్రాయి ప్రతిష్టాపన, పాల్గొన్న బిఆర్ఎస్ నేతలు |
సికింద్రాబాద్.. సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట్ హమాలి బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన...
By Sidhu Maroju 2025-10-26 10:00:32 0 304
Telangana
నిజామాబాద్
మారని గ్యాస్ ఏజెన్సీ తీరు..మండల కేంద్రం లో ని నావిపేట్ మండలంలో భారత్ గ్యాస్ వద్ద బారులు తీరిన...
By Sadaq Sadaq 2026-06-08 14:51:18 0 158
Manipur
Manipur Strengthens Disaster Management and Resilience
Manipur has continued to strengthen its disaster management framework through improved...
By Fathima Safa 2026-07-01 10:25:06 0 200
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com