సర్పంచుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక
Posted 2026-06-29 06:54:00
0
237
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సర్పంచుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని వాసవి భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా డోంగ్రె సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జాబరి రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే కోశాధికారిగా రాయిసిడాం వినోద్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కృష్ణాజీ బాధ్యతలు చేపట్టారు. ఉపాధ్యక్షులుగా వందన, రాజక్క, బుచ్చక్క, సురేష్, సహాయ కార్యదర్శులుగా విజయలక్ష్మి, రేణుకలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి నూతన కార్యవర్గం సమిష్టిగా కృషి చేస్తుందని ప్రతినిధులు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Sammakk🌷 సారలమ్మ జాతరలో తొలి ఘాట్టం మొదలైoది
*సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైంది.*
జాతరకు 15 రోజుల ముందు నిర్వహించే అత్యంత...
పుంగునూరు నియోజకవర్గం కందూరులో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం
సోమల మండలం, కందూరు గ్రామంలో సీతారాముల కల్యాణోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. వేద పండితుల...
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
హైదరాబాద్: 50% రిజర్వేషన్లు దాటకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు...
హైదరాబాద్ కాలేజ్ లో దారుణ ఘటన .|
హైదరాబాద్ : పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు.
అవమానం తట్టుకోలేక విద్యార్థిని...
Pharm.D I Year (R17) Regular & Supplementary Examinations, September/October 2025 Results Link Below !!!!
Pharm.D I Year (R17) Regular & Supplementary Examinations, September/October 2025 Results...