కొమురం భీమ్ చౌక్ వద్ద తప్పిన ప్రమాదం. రంగంలోకి మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు

0
199

🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కొమురం భీమ్ చౌక్ వద్ద ఒక పెద్ద విద్యుత్ ప్రమాదం తృటిలో తప్పింది. కొమురం భీమ్ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు ఉన్న ప్రధాన రహదారి డివైడర్ స్ట్రీట్ లైట్ల కనెక్షన్ వైరు ప్రమాదకరంగా డ్యామేజ్ కావడాన్ని గమనించిన స్థానికులు, వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. దీనిపై తక్షణమే స్పందించిన మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎండి అహ్మద్, మరియు మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు మున్సిపల్ విద్యుత్ సిబ్బందితో పాటు విద్యుత్ విభాగం అధికారులను, సిబ్బందిని వెంటనే రంగంలోకి దించారు. అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో విద్యుత్ శాఖ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పనిచేసి, డ్యామేజ్ అయిన విద్యుత్ వైరుకు తక్షణమే మరమ్మత్తులు పూర్తి చేసి పెద్ద ప్రమాదాన్ని అడ్డుకున్నారు. మున్సిపల్ మరియు విద్యుత్ యంత్రాంగం ఇంత వేగంగా స్పందించి ముప్పు తప్పించడం పట్ల ఆసిఫాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ బాలకృష్ణ, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలి
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా బొబ్బిలి పట్టణంలో ద్విచక్ర వాహనాలను నడిపిస్తూ నిరసన...
By Boiena Rajesh 2026-05-17 01:00:32 0 240
Telangana
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం.....!
జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం: పొంగులేటి భారత్ అవాజ్ న్యూస్: 13 మే రోజున...
By Gujile Ramu 2026-05-13 04:53:07 0 143
Andhra Pradesh
త్రిపురాంతకం మండలం నడిగడ్డ గ్రామంలో అన్నదాత సుఖీభవ - PM కిసాన్ (రైతన్న మీకోసం) 2026-27 సంవత్సర మొదటి విడత పంపిణి కార్యక్రమం
త్రిపురాంతకం మండలం నడిగడ్డ గ్రామంలో అన్నదాత సుఖీభవ - PM కిసాన్ (రైతన్న మీకోసం) 2026-27 సంవత్సర...
By Chennaiah Kati 2026-06-21 00:09:39 0 116
Prop News
Be Seen. Be Trusted. Be a PropMate.
Personal Branding for Real Estate: How to Position Yourself Authentically In today’s real...
By Bharat Aawaz 2025-06-26 05:56:59 0 2K
Gujarat
Gujarat Weather Update: Monsoon Brings Relief to State
The latest meteorological reports from June 26, 2026, paint a promising picture for Gujarat as...
By Lokeshwari Panthadi 2026-06-27 08:32:54 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com