కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు క్షేత్రస్థాయిలో మున్సిపల్ అధికారుల పరిశీలన

0
743

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని వివేకానంద చౌక్ వద్ద శనివారం రాత్రి కురిసిన వర్షానికి ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండి అహ్మద్, కౌన్సిలర్ చిలువూరు వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ అంజయ్య రోడ్లను స్వయంగా తనిఖీ చేశారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం, మళ్లీ వర్షం పడినా ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ అంజయ్యకు, మున్సిపల్ సిబ్బందికి చైర్మన్, వైస్ చైర్మన్ సూచించారు. అలాగే వర్షాల సీజన్ దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, మున్సిపల్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Kollu Ravindra: బూతులు తిట్టి తన్నులు తిన్నవారిని జగన్ పరామర్శిస్తున్నారు: కొల్లు రవీంద్ర.
ఆటవిక రాజ్యం ఎలా ఉంటుందో జగన్ చూపించారన్న కొల్లు రవీంద్ర జగన్ కు జంగిల్ రాజ్ అవార్డు ఇవ్వొచ్చని...
By Pagadala Venkateswar 2026-02-07 07:19:25 0 198
Telangana
బొల్లారం పీఎస్–ఎస్ఓటీ జాయింట్ ఆపరేషన్.. అక్రమ తుపాకులు స్వాధీనం.|
● అంతర్రాష్ట్ర నేరస్థుడి అరెస్ట్ ● రెండు 9ఎంఎం పిస్టల్స్, డబుల్ బ్యారెల్ తుపాకీ, 17 బుల్లెట్లు...
By Sidhu Maroju 2026-08-22 13:25:24 0 194
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కార వేదిక
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని...
By Bharat Aawaz 2025-05-27 04:42:17 0 3K
Andhra Pradesh
అన్నమయ్య: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రచారం
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని విద్యార్థులతో రూపొందించిన ప్రచార గేయం అందరినీ...
By Pagadala Venkateswar 2026-04-21 13:46:45 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com