ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి పోలీసుల అవగాహన సదస్సు.|

0
112

"PSARA చట్టం అమలు, అప్రమత్తతపై డీసీపీ కోటి రెడ్డి కీలక సూచనలు."

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ విక్రేతలకు మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహించారు. కంద్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 300 మంది హాజరయ్యారు.

కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో అదనపు డీసీపీ పురుషోత్తం, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఏసీపీ బాల గంగిరెడ్డి, జోన్ పరిధిలోని ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీసీపీ కోటి రెడ్డి మాట్లాడుతూ, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ యాక్ట్ (PSARA)-2005 ప్రకారం ప్రతి సెక్యూరిటీ ఏజెన్సీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. సందర్శకుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయడం, పరిమిత ప్రాంతాల్లోకి అనుమతించే ముందు వారి గుర్తింపును ధృవీకరించడం, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

అదేవిధంగా అత్యవసర పరిస్థితులు, శాంతిభద్రతల పరిరక్షణ, వీఐపీ బందోబస్తు సమయంలో పోలీసులకు పూర్తి సహకారం అందించాలని, ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూసుకోవాలని, అత్యవసర సంప్రదింపు నంబర్లను అందుబాటులో ఉంచుకుని పోలీసుల సూచనలను వెంటనే అమలు చేయాలని సూచించారు.

PSARA-2005 చట్టంలోని నిబంధనలను వాస్తవ సంఘటనలతో వివరించిన డీసీపీ కోటి రెడ్డి, ప్రతి సెక్యూరిటీ ఏజెన్సీ చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

#Sidhumaroju

Search
Categories
Read More
SURAKSHA
C. Lalsawivunga, IAS: Driving Progress Through Governance
The Journey begins "The strength of a nation lies not only in its policies but...
By Fathima Safa 2026-07-21 11:14:40 0 128
Telangana
కార్మికుల క్షేత్రంలో జలకళ... సిరిసిల్ల మానేరువాగులో నిరంతరం గోదారమ్మ సేద
తాగునీటికి తండ్లాడిన నేల.. సాగునీటి కోసం ఎదురుచూసిన సారవంతమైన భూమి.. మానేరు తప్ప మరో మార్గం లేని...
By Ponnala Srinivasrao 2026-03-24 02:08:33 0 227
Jammu & Kashmir
🔥 Fierce Encounter in Udhampur: Terrorists Cornered in Basantgarh Forest
A major counter-terrorism operation is currently underway in Basantgarh, Udhampur district...
By Bharat Aawaz 2025-07-09 13:00:09 0 1K
Andhra Pradesh
అన్నమయ్య: ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం తప్పనిసరి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలోని 1,792 అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్‌లు, వంట...
By Pagadala Venkateswar 2026-06-24 04:22:56 0 94
Andhra Pradesh
జగన్ దమ్ము,ధైర్యం ఎంటో ఏపీ ముక్యమంత్రిని అడగండి...
విశాఖపట్నం :- మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హేళన చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఆయనపై...
By Thokala Sivaji 2026-03-23 17:09:25 0 781
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com