వృద్ధుడిని బెదిరించి దోపిడి చేసిన ముద్దాయిని కేవలం 48 గంటల వ్యవధిలోనే అరెస్టు చేసి సొత్తు సుమారు 25000/ విలువల కలిగిన 2 బంగారు ఉంగరాలు రికవరీ చేసిన కొల్లిపర అరెస్టు చేసి పోలీస్ వారు

0
98

వృద్ధిడిని బెదిరించి దోపిడీ చేసిన ముద్దాయి ని కేవలం 48 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి చోరీ సొత్తు సుమారు 250000/- విలువ కలిగిన 2 బంగారు ఉంగరాలు రికవరీ చేసిన కొల్లిపర పోలీస్ వారు 

🚩 ది 18.06.2026 న ఉదయం 07:00 గంటలకు గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం మరియు గ్రామ నివాసి అయిన కొల్లి వెంకట శ్రీనివాస రెడ్డి, S/o రామిరెడ్డి అను అతను ది. 18.06.2026న తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో నిద్రలేచి ఇంటి తలుపు తీయగా, బయట ఉన్న ఒక అపరిచిత వ్యక్తి లోపలికి వచ్చి, ఆయన్ని మంచంపైకి నెట్టి, "నీ చేతికి ఉన్న ఉంగరాలు నాకు ఇవ్వు, లేకపోతే చంపేస్తాను" అని బెదిరించగా భయభ్రాంతులకు గురైన పిర్యాది , తన చేతులకు ఉన్న సుమారు 16 గ్రాములు కలిగిన 2 బంగారు ఉంగరాలు అతనికి ఇచ్చినారు. ఆ అపరిచిత వ్యక్తి ఉంగరాలను మరియు టీవీ టేబుల్ మీద ఉన్న శామ్‌సంగ్ ఫోన్ తీసుకుని పారిపోయాడు. ఎవరో గుర్తుతెలియని దొంగ ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసినట్లు రిపోర్టు ఇచ్చినారు.

📍 కొల్లిపర యస్.ఐ N.C.ప్రసాద్ గారు Cr.No.68/2026 U/s 329(4), 308(2) BNS of Kolliipara PS గా కేసు నమోదు చేసి, కేసు వివరాలు శ్రీ తెనాలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ SK నాయబ్ రసూల్ గారికి తెలియపరచగా, ఇన్స్పెక్టర్ గారి ఉత్తర్వులు మేరకు సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కొల్లిపర శ్రీ N.C.ప్రసాద్ గారు, కొల్లిపర సిబ్బంది HC రామకోటేశ్వరరావు, PC లు రామకృష్ణ ,కూర్మరావు మరియు HG అశోక్ లను ఒక టీం గా ఫామ్ చేసి సదరు కేసులో దర్యాప్తు చేపట్టినారు.

📍 సదరు కేసులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు CC కెమెరా ల ద్వార దర్యాప్తు చేపట్టి దొంగతనం చేసిన వ్యక్తి బాపట్ల జిల్లా,చెరుకుపల్లి మండలం, రాంబొట్లవారి పాలెం గ్రామస్తుడు పగడం ఉమాశంకర్ రెడ్డి గా గుర్తించి ఖచ్చితమైన సమాచారంతో ది.20.06.2026 వ తేది ఉదయం వల్లభాపురం గ్రామ కరకట్ట వద్ద వున్న ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ముద్దాయిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి దొంగిలించబడిన బంగారపు ఉంగరాలు-2 సుమారు 240000/- విలువ కలిగినవి రికవరీ చేసి ముద్దాయిని రిమాండ్ కు తరలించడం జరిగినది..

📍 ఫిర్యాదు అందిన సకాలంలో స్పందించి కేవలం 48 గంటల లోపే దొంగను అరెస్ట్ చేసి, ప్రాపర్టీ రికవరీ చేసిన తెనాలి రురల్ CI నాయబ్ రసూల్ గారిని, కొల్లిపర ఎస్సై ప్రసాద్ గారిని మరియు వారి సిబ్బందిని తెనాలి DSP శ్రీ B. జనార్దన్ రావు గారు అబినందించినారు.

📍ఈ సందర్భంగా తెనాలి డిఎస్పి B జనార్దన్ రావు గారు మాట్లాడుతూ కొల్లిపర మండల గ్రామ ప్రజలందరూ విరివిగా సీసీ కెమెరాలు మీ గృహాలకు అలాగే గ్రామంలో మెయిన్ సెంటర్లో అమర్చుకోవాల్సిందిగా కోరినారు సీసీ కెమెరాలు 24 గంటలు నిఘా కలిగి ఉంటాయి కావున గ్రామస్తులు మరియు దాతలు ముందుకు వచ్చి ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు అమర్చకోవాల్సిందిగా కోరినారు...

Search
Categories
Read More
Andhra Pradesh
టుమారో ఎంపీ షెడ్యూల్ విజయనగరం పార్లమెంట్
విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి రేపటి షెడ్యూల్, విజయనగరం ఎంపీ గారి...
By Mukku Ramu 2026-03-18 13:52:05 0 706
Telangana
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన సామాన్యుడి నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు పెంచుతోంది : డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): ఆసిఫాబాద్: కేంద్ర ప్రభుత్వం...
By Chunarkar Jagadeesh 2026-05-25 16:21:13 0 518
Telangana
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి....
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి డీఆర్‌డీఓ నాగ పద్మజ... లక్ష్మీపురంలో ఊర చెరువు పూడికతీత...
By Gujile Ramu 2026-04-29 15:13:16 0 413
SURAKSHA
Leading from the Front: The Operational Excellence of IPS V. Satyanarayana
 The Architect of Order: How IPS V. Satyanarayana is Redefining Public Trust in Policing...
By Kalaga Sailaja 2026-07-11 12:21:35 0 179
Andhra Pradesh
Ycp పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు  తాడేపల్లి లోని సెంటర్ ysrcp పార్టీ ఆఫీసు దగ్గర ప్రెస్...
By Kola Kirankumar 2026-03-31 18:28:44 0 495
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com