రేపు ముఖ్యమంత్రి గారి పర్యటనకు పటిష్టమైన మందబోస్తే ఏర్పాట్లు చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు

0
114

రేపు ముఖ్యమంత్రి గారి పర్యటనకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు

బందోబస్తు సమర్థవంతంగా నిర్వర్తించేందుకు పోలీసు అధికారులు మరియు సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ గారు

బందోబస్తు నిర్వహించే సమయంలో విధులు పట్ల పోలీస్ సిబ్బంది అప్రమత్తతో ఉండాలి: జిల్లా ఎస్పీ గారు

రేపు ఈ నెల 27 న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ను ప్రారంభించునున్న నేపథ్యంలో శనివారం గిద్దలూరులో జిల్లా ఎస్పీ గారు బందోబస్తు విధులలో పాల్గొనబోయే పోలీసు అధికారులతో బ్రీఫింగ్ సమావేశాన్ని నిర్వహించి బందోబస్తు విధులపై దిశానిర్దేశం చేశారు. 

జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ప్రారంభం నుండి ముగిసే వరకు బందోబస్తు విధులు నిర్వర్తించే అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వారికి కేటాయించిన స్థలాలకు నిర్దేశించిన సమయానికి విధులకు హాజరు కావాలని సూచించారు. హెలిప్యాడ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సభ వేదిక, వీఐపీ రూట్ బందోబస్తు, గ్యాలరీలు, మఖ్యంగా పార్కింగ్ ప్రదేశాలలో భద్రతాపరమైన అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అవసరమైన చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సిబ్బంది తమకు కేటాయించిన పాయింట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బయట నుండి వచ్చే వాహనాలు కేటాయించిన స్థలాలలోనే పార్కింగ్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. సభ ప్రాంగణంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎవరైనా తమ విధులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ముఖ్యమంత్రి గారి పర్యటనకు వచ్చే ప్రజలు తమకు కేటాయించిన ప్రదేశాల్లోనే వాహనాలను నిలపాలని, అలాగే వెళ్లేటప్పుడు కూడా క్రమపద్ధతిలో వెళ్లాలని సూచించారు. అదేవిధంగా పోలీసు శాఖ సూచించిన నిబంధనలు మరియు సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి గారి మార్కాపురం జిల్లా పర్యటనకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేపట్టిందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఈ బందోబస్తు నిమిత్తం 2 ఏఎస్పీలు, 7 మంది డిఎస్పీలు, 32 సీఐలు, 84 మంది ఎస్ఐలతో పాటు 829 మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, స్పెషల్ పార్టీ సిబ్బంది ఏఆర్ సిబ్బంది, APSP సిబ్బందిని కేటాయించామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ ట్రయిల్ రన్ నిర్వహించిన మార్కాపురం జిల్లా ఎస్పీ గారు

జిల్లా ఎస్పీ గారు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి హెలిప్యాడ్‌ నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సభా వేదిక, కార్యకర్తల మీటింగ్ జరిగే ప్రాంతం వరకు నిర్వహించిన సి.యం గారు కాన్వాయ్ ట్రయిల్‌ రన్‌ను పర్యవేక్షించి అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు తెలియ చేశారు. 

ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ వచ్చేటప్పుడు బందోబస్త్ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని, కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా స్పెషల్ పార్టీ, పోలీసు బృందాలు, పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, కాన్వాయ్ ప్రారంభం నుంచి ముఖ్యమంత్రి గారి కార్యక్రమం పూర్తయ్యేంత వరకూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా బాధ్యతాయుతంగా బందోబస్త్ విధులు నిర్వహిస్తూ సీఎం పర్యటనను విజయవంతంగా పూర్తి చేయాలని ఎస్పీ గారు అధికారులను ఆదేశించారు.

జిల్లా ఎస్పీ గారి వెంట ఎస్ఎస్ జి అడిషనల్ ఎస్పీ సిహెచ్ మల్లికార్జున, అడిషనల్ ఎస్పీ సిహెచ్ జీవి ప్రసాద్, ఏపీఎస్పీ ఏడవ బెటాలియన్ కమాండెంట్ ఏ మురళి, డీఎస్పీలు, సిఐలు మరియు ఎస్ఐలు ఉన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Karnataka Police Today: Guardians Of Road Safety
Today Karnataka traffic police focused on saving lives on roads. School zones in Bengaluru,...
By Kalaga Sailaja 2026-07-04 06:46:46 0 105
Andhra Pradesh
కోళ్ల దానాకే రేషన్ బియ్యం
ఎన్టీఆర్ జిల్లా నందిగామ:   *కంచికచర్ల, వీరులపాడు మండలంలో భారీగా బాయిలర్ కోళ్ళ పెంపకం...
By Rajini Kumari 2026-03-13 13:55:18 0 224
Andhra Pradesh
కన్నతల్లిని జన్మభూమిని ఎన్నటికీ మరువకూడదు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగం
*కన్నతల్లి, జన్మభూమిని ఎన్నటికీ మరువరాదు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు*  ...
By Rajini Kumari 2025-12-18 08:06:20 0 228
Telangana
అల్వాల్ పీఎస్ పరిధిలో హత్య కలకలం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పి.ఎస్. ఎస్ హెచ్ ఓ  ప్రశాంత్ తెలిపిన వివరాల...
By Sidhu Maroju 2026-01-04 14:37:16 0 237
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:104 వాహనం పనితీరుపై రీజనల్ మేనేజర్ సమీక్ష
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో సోమవారం రీజనల్ మేనేజర్ RM.ఇక్బాల్ హుస్సేన్, DM.వేణుగోపాల్,...
By Kothuru Murali 2026-05-05 15:12:51 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com