డ్రగ్స్‌కు 'నో'... ఆరోగ్యకరమైన జీవితానికి 'యెస్' చెప్పండి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

0
208

డ్రగ్స్‌కు 'నో'... ఆరోగ్యకరమైన జీవితానికి 'యెస్' చెప్పండి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల: జూన్ 26 

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంచిర్యాలలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు 2కే రన్ నిర్వహించారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎ. భాస్కర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, "డ్రగ్స్‌కు 'నో' చెప్పండి... ఆరోగ్యకరమైన జీవితానికి 'యెస్' చెప్పండి" అంటూ యువతకు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.

 

డీసీపీ ఎ. భాస్కర్ మాట్లాడుతూ, డ్రగ్స్, గంజాయి రహిత మంచిర్యాలే లక్ష్యమని, మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే డయల్-100 లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1908కు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో ఏసీపీ ఆర్. ప్రకాష్, టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్‌రావు, పోలీసులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
M. G. Rajamanickam IAS: Transforming Governance with Vision
The Journey Begins Among Kerala's accomplished civil servants, M. G....
By Fathima Safa 2026-07-14 11:35:56 0 367
BMA
Tax Probes: New 2025 Laws Risk Journalistic Sources
The new Income Tax Act of 2025 has raised severe fears that authorities could misuse expanded...
By JoinBMA 2026-08-21 06:20:34 0 71
SURAKSHA
Magizhchi: A Holistic Wellness Initiative for Police
The Tamil Nadu Police’s 'Magizhchi' program is a vital initiative designed to prioritize...
By Lokeshwari Panthadi 2026-07-03 08:49:38 0 186
Andhra Pradesh
మదనపల్లి లో దినసరి మార్కెట్ టెండర్లు వాయిదా.
మదనపల్లె మున్సిపాలిటీలో 2026–27 ఏడాదికి గాను వారపు సంత, జంతు వధశాల వేలం పాటలు బుధవారం...
By Pagadala Venkateswar 2026-03-12 05:42:02 0 198
Andhra Pradesh
శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరుణాల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి మండలం అబ్బవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరుణాల మహోత్సవ...
By Benguluri Madhubabu 2026-03-21 07:34:56 0 260
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com