ఆసిఫాబాద్ మున్సిపాలిటీ జనకపూర్ 1వ వార్డులో ముమ్మరంగా సాగుతున్న 'SIR' సర్వే. క్షేత్రస్థాయిలో అడిషనల్ కలెక్టర్ మరియు అధికారుల ఉమ్మడి తనిఖీ

0
268

కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్: తెలంగాణ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన Special Intensive Revision (SIR) - ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జనకపూర్ 1వ వార్డులో కొనసాగుతున్న ఇంటింటి సర్వే ప్రక్రియను అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, మరియు మున్సిపల్ చైర్మన్ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డు పరిధిలో బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLO) సేకరిస్తున్న ఓటర్ల వివరాల రికార్డులను మరియు ఎన్యూమరేషన్ ఫారాలను స్వయంగా పరిశీలించిన అడిషనల్ కలెక్టర్, 1వ వార్డు ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ వినోద్, వార్డు ఆఫీసర్ రామయ్య మరియు పెద్ద సంఖ్యలో 1వ వార్డు ప్రజలు పాల్గొని అధికారుల బృందానికి పూర్తి స్థాయిలో సహకరించారు.

Search
Categories
Read More
Telangana
వరంగల్ జిల్లా పాత MGM భవనాన్ని ఏం చేశారో....? మొదలైన చర్చ
భారత్ అవాజ్ న్యూస్:27 మే రోజున ఉత్తర తెలంగాణకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని...
By Gujile Ramu 2026-05-27 04:25:28 0 161
Andhra Pradesh
పెన్షన్ కోసం బిడ్డను భుజాన మోసుకుని కలెక్టరేట్‌కు.
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తంబళ్లపల్లికి...
By Pagadala Venkateswar 2026-06-16 04:23:51 0 99
Andhra Pradesh
ఆస్తిని మోసంగా రిజిస్టర్ చేయించుకున్న కూతురుపై వృద్ధదంపతుల ఫిర్యాదు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తమ ఇంటి ఆస్తిని రెండవ కుమార్తె షేక్ రఫియా మోసపూరితంగా తన పేరుకు...
By Pagadala Venkateswar 2026-03-09 08:07:33 0 166
SURAKSHA
K. A. P. Sinha, IAS: Punjab's Trusted Administrator
A seasoned 1992-batch IAS officer of the Punjab cadre, K. A. P. Sinha has emerged as one of...
By Lokeshwari Panthadi 2026-07-25 08:07:14 0 135
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 50 మందికి ఫుడ్ పాయిజన్
*_ఎన్టీఆర్ జిల్లా/నందిగామ_*   *_50 మందికి ఫుడ్ పాయిజన్_*   _నందిగామ మండలం చందాపురం...
By Rajini Kumari 2026-03-30 04:43:25 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com