స్వాతంత్ర్యం వచ్చాక ఇదే తొలిసారి: కూటమి ప్రభుత్వంపై మహానాడులో ట్రాన్స్‌జెండర్ వర్షిణి ప్రశంసలు.

0
110

కూటమి ప్రభుత్వం తమ జీవితాల్లో వెలుగులు నింపిందని వ్యాఖ్య

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి పీఏగా వర్షిణి నియామకం

ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు గొప్ప ఆలోచన అన్న వర్షిణి

తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి వ్యక్తిగత సహాయకురాలిగా (పీఏ) పనిచేస్తున్న ట్రాన్స్‌జెండర్ వర్షిణి, కూటమి ప్రభుత్వం తమ జీవితాల్లో వెలుగులు నింపుతోందని చెబుతూ భావోద్వేగంగా ప్రసంగించారు. ఆమె మాటలు సభకు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి.

 

మంగళగిరిలో జరుగుతున్న మహానాడులో వర్షిణి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ట్రాన్స్‌ జెండర్ల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రశంసించారు. "స్వాతంత్య్రం వచ్చాక ఏ ప్రభుత్వమూ, ఏ రాజకీయ నాయకులు చేయని ఆలోచనలు కూటమి ప్రభుత్వంలో చేసి ట్రాన్స్‌ జెండర్ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు," అని ఆమె పేర్కొంది. గతంలో ఏ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం తమకు గౌరవం కల్పిస్తోందని ఆమె అన్నారు. ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అందులో ట్రన్స్ జెండర్ ను నియమించడం ఎవరికీ సాధ్యం కాని గొప్ప ఆలోచనగా ప్రశంసించింది.

 

ఒక ట్రాన్స్‌ జెండర్‌ను ఎమ్మెల్యేకు పీఏగా నియమించడం, ఇప్పుడు పార్టీ ప్రధాన సభ అయిన మహానాడులో మాట్లాడే అవకాశం ఇవ్వడం తమ వర్గానికి దక్కిన గొప్ప గౌరవంగా వర్షిణి అభివర్ణించారు. ఇది తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని, ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
"సర్వస్వం కోల్పోయిన బిఆర్ఎస్ నాయకురాలు: తక్షణ సాయంతో అండగా అనిల్ కిశోర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  కనజిగూడ డివిజన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది....
By Sidhu Maroju 2026-05-21 06:51:17 0 277
Sikkim
Sikkim Hydropower Projects Driving Green Energy Growth
Sikkim’s hydropower and energy projects continue to play a crucial role in the...
By Fathima Safa 2026-06-25 07:38:55 0 88
Andhra Pradesh
ఎస్సీ మొర్చా ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం
ఎస్సీ మోర్చ ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది వివరాలకు వెళితే విశాఖ బీచ్ రోడ్ కామత్ బోజన...
By Mobbu Venkatramana 2026-03-12 14:15:43 0 671
Andhra Pradesh
మదనపల్లె: 'జలధార–జలహారతి' 100 రోజుల మిషన్ ప్రారంభం.
అన్నమయ్య జిల్లాలో నీటి కొరతకు శాశ్వత పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్...
By Pagadala Venkateswar 2026-04-07 04:00:08 0 194
Andhra Pradesh
నేడు విజయనగరానికి లోకేశ్
మంత్రి నారా లోకేశ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల వరకు...
By Boiena Rajesh 2026-08-22 05:40:53 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com