కాపుల ద్రోహి వైయస్సార్సీపి అన్నమయ్య జిల్లా బలిజ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గండికోట సుధాకర్

0
199

*కాపుల ద్రోహి వైఎస్సార్‌

 

 

 

 రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నాయకత్వంలో రాయచోటి నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం లభిస్తోందని అన్నమయ్య జిల్లా బలిజ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గండికోట సుధాకర్ అన్నారు.మంత్రి రాంప్రసాద్ రెడ్డి కుల, మతాలకు అతీతంగా సామాన్య కార్యకర్తలను గుర్తించి రాష్ట్రస్థాయి డైరెక్టర్ పదవులు కల్పించడం ఆయన నాయకత్వానికి నిదర్శనమని కొనియాడారు. గతంలో గుర్తింపు లేకుండా పనిచేసిన అనేక మంది కార్యకర్తలకు ఇప్పుడు బాధ్యతలు, గౌరవం దక్కుతోందని పేర్కొన్నారు. రాయచోటి నియోజకవర్గంలోని 6 మండలాల గాను రాయచోటి,లక్కిరెడ్డిపల్లి మండలాలకు టిడిపి మండల అధ్యక్షులుగా కాపు కులస్తులను ఎంపిక చేసి రాయచోటిలోనే బలిజ కులస్తులకు సముచిత సంస్థ స్థానం కల్పించిన ఘనత మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కే దక్కిందన్నారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని గండికోట సుధాకర్ అన్నారు. ప్రజల మద్దతుతో ఎన్నికైన నాయకులపై వ్యక్తిగత విమర్శలు, అవమానకర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు.రాజకీయాల్లో విమర్శలు విధానాలపై ఉండాలే గానీ వ్యక్తిగత దూషణలు, సామాజిక వర్గాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగవని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన, అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతోందని, ప్రజలు కూడా అదే దిశగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్‌పై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా గట్టిగా ఖండిస్తామని గండికోట సుధాకర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాపు నేతలు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: ఏపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రికెట్ పోటీలు... కెప్టెన్లు ఎవరంటే..!
రేపటి నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఇందిరాగాంధీ...
By Pagadala Venkateswar 2026-02-23 10:09:44 0 326
Chandigarh
Creative Weekends: Join CLKA Art Workshops in Chandigarh
Unleash your inner artist this July at the iconic Le-Corbusier Centre in Sector 19. The CLKA Open...
By Lokeshwari Panthadi 2026-07-03 06:03:48 0 83
Telangana
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మందమర్రి మండలం పొన్నారం గ్రామ పంచాయతీలో నల్లెల్లి వినీత్ – శ్రావంతి దంపతుల నూతన గృహప్రవేశ...
By Avunoori Mahesh 2026-04-26 12:24:34 0 184
Telangana
రూప్లా తండాలో క్రికెట్ టోర్నమెంట్
*సీరోల్ మండలం రేకులతండా గ్రామపంచాయతీ రూప్లా తండాలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన డిప్యూటీ...
By CM_ Krishna 2026-01-13 13:31:15 0 348
Telangana
కాట్రియాల-పర్వతపూర్ రోడ్డు కంకరమయం
రామాయంపేట మండలం కాట్రియాల గ్రామం నుంచి పర్వతాపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా...
By Katiyala JeevanRaj 2026-03-14 10:00:20 0 566
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com