ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు: శ్రీగణేష్.|

0
257

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 24 నుంచి జూలై 24 వరకు నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద బీఎల్ఏలతో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. 

వార్డు నంబర్-2లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ..ఓటరు జాబితా సవరణ ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఇప్పటికే ఓటరుగా ఉన్నవారు తమ పేరు జాబితాలో ఉందో లేదో స్వయంగా పరిశీలించుకోవాలని సూచించారు. పేర్లు లేకపోయినా, వివరాల్లో పొరపాట్లు ఉన్నా వెంటనే సరిచేయించుకోవాలని కోరారు.

ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో పలు పరిపాలనా, సంక్షేమ అంశాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున బీఎల్ఏలు నెల రోజుల పాటు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పిస్తారని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు. బీఎల్ఏలను ఉద్దేశించి మాట్లాడుతూ అత్యంత బాధ్యతతో విధులు నిర్వహించాలని, ఒక్క అర్హుడి ఓటు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్‌ఐఆర్ కో-ఆర్డినేటర్లు బద్రీనాథ్ యాదవ్, సంకి రవీందర్, వార్డు-2 కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు, బీఎల్ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
దాంపత్యం అనేది ఒక నమ్మకం తో కూడిన ప్రయాణం.. స్వాతి నుండి రేణుక వరకు..‎భ‌ర్త‌లు వ‌ద్దు బాయ్ ఫ్రెండ్సే ముద్దు అంటూ అరాచకం
వివాహ వ్యవస్త మీద నమ్మకం ప్రాధాన్యత విలువలు లేకపోవడం విపరీతమైన స్వేచ్ఛ పెద్దలు ఆదాయ సంపాదనలో పడి...
By Ponnala Srinivasrao 2026-05-03 04:29:55 0 163
Telangana
"వాసవీ జయంతికి సెలవు: సీఎంలకు కైలాష్ రాంచెందర్ గుప్త ధన్యవాదాలు.|
హైదరాబాద్ : వాసవీ మాత ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక...
By Sidhu Maroju 2026-04-30 05:47:30 0 542
Andhra Pradesh
అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎం ఆర్ మానవ అక్కుల సంఘం నాయకులు
అంగన్వాడీ కేంద్రంన్నీ తనిఖీ చేసిన యం.ఆర్.మానవ హక్కుల సంఘం నాయకులు  పలు సమస్యలు గుర్తించి,పై...
By Chennaiah Kati 2026-03-13 14:24:50 0 423
Andhra Pradesh
ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ కేంద్రం: భయాందోళనలో పిల్లల తల్లిదండ్రులు!
చింతూరు మండలం రత్నపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణం గత 10 సంవత్సరాలుగా అసంపూర్తిగానే...
By Shyamala Yadagiri 2026-06-03 11:43:59 0 280
Telangana
ఈ నెల 12న ఇంటర్ ఫలితాలు విడుదల
రాష్ట్రంలో ఆదివారం(ఏప్రిల్ 12) ఇంటర్మీడియేట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది....
By Pinnehasan Odela 2026-04-11 17:14:57 0 331
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com