భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల బామ్మ.

0
105

 

భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల బామ్మ

24-06-2026 Wed 09:34

Andhra

Kondrugunta Mahalakshmamma 94 year old woman renounces US citizenship to die as an Indian citizen

పుట్టిన గడ్డపై ప్రేమతో అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ

భారత పౌరురాలిగా తుదిశ్వాస విడవాలన్నదే తన చివరి కోరిక అని వెల్లడి

బాపట్ల కలెక్టరేట్‌లో భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వృద్ధురాలు

దరఖాస్తును కేంద్ర హోంశాఖకు పంపుతామన్న కలెక్టర్ వినోద్‌కుమార్

అమెరికా నుంచి క్లియరెన్స్ రాగానే భారత పౌరసత్వం మంజూరు చేస్తామ‌ని వెల్ల‌డి

ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్తు కోసం యువతరం అమెరికా బాట పడుతున్న ఈ రోజుల్లో, 94 ఏళ్ల వృద్ధురాలు పుట్టిన గడ్డపై మమకారంతో అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నారు. తన తుదిశ్వాసను భారత పౌరురాలిగా ఈ మట్టిలోనే విడవాలన్న బలమైన ఆకాంక్షతో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ స్ఫూర్తిదాయక ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది.

 

వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపల గ్రామానికి చెందిన కొండ్రుగుంట మహాలక్ష్మమ్మ (94) తన చివరి కోరికను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆమె కుమారుడు డాక్టర్ బుచ్చయ్య చౌదరి చాలాకాలం క్రితం అమెరికాలోని వర్జీనియాలో స్థిరపడ్డారు. భర్త నాగభూషణం మరణానంతరం మహాలక్ష్మమ్మ కూడా అమెరికా వెళ్లి, 2000 సంవత్సరంలో అక్కడి పౌరసత్వం పొందారు. అయితే, మాతృభూమిపై ఉన్న ప్రేమతో ఆమె 2018లో తన కుమారుడి కుటుంబంతో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చేశారు. గత ఎనిమిదేళ్లుగా ఆమె తన సొంతూరైన చింతగుంపలలోనే నివసిస్తున్నారు.

 

"నా కట్టె ఇక్కడే కాలాలి, పుట్టిన ఊరి మట్టిలోనే కలిసిపోవాలి" అన్నది మహాలక్ష్మమ్మ చివరి కోరిక. ఈ నేపథ్యంలో ఆమె తన అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని, భారత పౌరసత్వం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. గతంలో దరఖాస్తులో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తడంతో, వాటిని సరిదిద్ది తాజాగా మళ్లీ దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఆమె నిన్న‌ బాపట్ల కలెక్టరేట్‌కు హాజరయ్యారు.

 

జిల్లా కలెక్టర్ పి. వినోద్‌కుమార్ సమక్షంలో మహాలక్ష్మమ్మ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, దేశ చట్టాలకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహాలక్ష్మమ్మ ప్రమాణ పత్రంతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర హోంశాఖకు పంపిస్తామని తెలిపారు. అనంతరం కేంద్ర హోంశాఖ ఈ దరఖాస్తును అమెరికా ఎంబసీకి పంపుతుందని, అక్కడి నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే మహాలక్ష్మమ్మకు భారత పౌరసత్వం లభిస్తుందని వివరించారు. ఈ ప్రక్రియ పూర్తయితే, తన మాతృభూమిలో భారత పౌరురాలిగా జీవించాలన్న మహాలక్ష్మమ్మ చిరకాల స్వప్నం నెరవేరుతుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ శక్తి అమ్మ స్వామి ఆశీర్వాదాలు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
తమిళనాడులోని వేలూరు లో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ సృష్టికర్త శ్రీ శక్తి అమ్మ...
By Benguluri Madhubabu 2026-04-18 14:08:27 0 247
Kerala
Monsoon Knocking: Heavy Rain & Alerts Hit 10 Districts
The Southwest Monsoon is at Kerala's doorstep, prompting the India Meteorological Department...
By Dunna Jessicaruth 2026-05-25 06:21:09 0 225
Andhra Pradesh
ఆలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చోరీ – రూ.4 లక్షల విలువైన నగలు అపహరణ
పెద్దాపురం పట్టణంలోని విశాలాక్షి నగర్‌లో సోమవారం రాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది. ఉమ్మెళ్ల...
By Ratna Sekhar 2026-02-19 19:23:40 0 2K
Andhra Pradesh
పుస్తకమే ప్రపంచాన్ని మార్చింది : రాఘవరెడ్డి
శుక్రవారం నాడు మదనపల్లి పట్టణంలో బిటి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాఘవ రెడ్డి చేతులమీదుగా విశాలాంధ్ర...
By Pagadala Venkateswar 2026-02-28 06:33:37 0 212
Andhra Pradesh
స్పందన కార్యక్రమం కు పోటెత్తిన జనం – కలెక్టరేట్ కిటకిట.
మదనపల్లిలోని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వేలాది మంది...
By Pagadala Venkateswar 2026-02-02 07:21:58 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com