రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పరిగి పర్యవేక్షించిన మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు

0
93

రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించిన మార్కాపురం జిల్లా కలెక్టర్, ఎస్పీ గార్లు

ఈ నెల 27వ తేదీ న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ను ప్రారంభించునున్న నేపథ్యంలో ముందస్తుగా భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత, ఐఏఎస్ గారు , జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపియస్.,గారు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు,గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు మరియు జిల్లా అధికారులు పరిశీలించారు.

 హెలిప్యాడ్ ప్రదేశం, ప్రజా వేదిక, పార్కింగ్ ప్రాంతాలను, సీఎం కాన్వాయ్ రూట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు చుట్టు ఉన్న ప్రాంతములను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంకా తీసుకోవాల్సిన ఏర్పాట్లు చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు వీఐపీల వాహనాల రాక, సభా స్థలంలో వేదిక, పార్కింగ్‌ ఏరియా, సీఎం ప్రవేశం, నిష్క్రమణ స్థలాలను, హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ఉన్న రూట్ ను, క్షుణ్ణంగా పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. ఇతర శాఖల సమన్వయంతో అన్ని చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ గారి ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో మార్కాపురం జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం డి.ఎస్.పి యు. నాగరాజు, ఎస్బి ఇన్స్పెక్టర్ యం.శ్రీనివాసరావు, గిద్దలూరు అర్బన్ సీఐ కె. సురేష్, రూరల్ సీఐ రామకోటయ్య, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ : ఉజ్జయిని మహంకాళి బోనాలు
సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర ఘనంగా జరిగింది. ఈరోజు తెల్లవారు జామున నుంచే భక్తులు అమ్మవారికి...
By Sunka Santhosh 2026-08-02 18:26:19 0 178
Andhra Pradesh
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ సమావేశం
విజయవాడ    విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
By Rajini Kumari 2026-04-08 16:19:28 0 194
Andhra Pradesh
ప్రభుత్వ వేతనమే ముద్దు.. పారితోషికం వద్దు: అంగన్‌వాడీల గర్జన.
తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో...
By Pagadala Venkateswar 2026-02-24 07:38:54 0 195
Andhra Pradesh
నాదెండ్ల భాస్కరరావుకు జనసేన నాయకుల ఘన నివాళి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో జనసేన...
By Pagadala Venkateswar 2026-05-01 04:03:02 0 125
Andhra Pradesh
గ్రామ రెవిన్యూ అధికారుల సమస్యలు పరిష్కారం: డివిజన్ అధ్యక్షులు శేఖర్
గ్రామ రెవిన్యూ అధికారుల సమస్యలు పరిష్కారం: డివిజన్ అధ్యక్షులు శేఖర్   చీరాల: గ్రామ...
By Gadiyapudi Narendra 2026-01-08 12:21:01 0 252
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com