ఆదోని పట్టణంలోని DSF.PDSO ఆధ్వర్యంలో

0
188

ఆదోని నారాయణ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి.రకరకాల పేర్లతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్న కార్పొరేట్ నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.అనంతరం నారాయణ పాఠశాల దగ్గర DSF, PDSO విద్యార్థి సంఘాల ఆధ్వర్యం లో ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ మాట్లాడుతూ.ఆదోనిలోని నారాయణ విద్యాసంస్థల్లో స్కూల్ ఫీజు, బుక్స్ ఫీజు, యూనిఫామ్ ఫీజు తదితర రకరకాల పేర్లతో తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని DSF, PDSO విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.విద్యను వ్యాపారంగా మార్చి, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై అధిక ఫీజుల భారాన్ని మోపడం సరైంది కాదు. అడ్మిషన్ల సమయంలో చెప్పిన ఫీజులకు అదనంగా వివిధ రకాల పేర్లతో వసూళ్లు చేయడం, పుస్తకాలు, యూనిఫామ్స్ తప్పనిసరిగా తమ వద్దనే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడం వంటి చర్యలను వెంటనే నిలిపివేయాలి.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యతను గుర్తించి, ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.నారాయణ విద్యాసంస్థల్లో జరుగుతున్న అధిక ఫీజుల వసూళ్లపై విచారణ జరపాలి.బుక్స్, యూనిఫామ్ పేరుతో అదనపు వసూళ్లను నిలిపివేయాలి.తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించేలా ఫీజు నియంత్రణ చర్యలు తీసుకోవాలి.నిబంధనలు ఉల్లంఘించే కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.

Search
Categories
Read More
Andhra Pradesh
తాడేపల్లిలో ఆగని మట్టి మాఫియా
*తాడేపల్లిలో ఆగని మట్టి మాఫియా: లారీ ఢీకొని యువకుడికి గాయాలు.. స్థానికుల ఆందోళన!*  ...
By Rajini Kumari 2026-02-05 09:17:31 0 212
Andhra Pradesh
ఉపాధ్యాయులు విద్యార్థులకు పునాది లాంటి వాళ్లు
 నందవరం మండల కేంద్రంలోMPPS స్పెషల్ పాఠశాల హెచ్ఎం ఎండి శ్రీనివాసులు గారు నిర్వహించిన...
By Boya Dasthagiri 2026-09-05 14:52:42 0 167
Andhra Pradesh
రైతులకు ‘అన్నదాత సుఖీభవ’, పీఎం కిసాన్ నిధుల విడుదల.
అన్నమయ్య జిల్లాలో 1,88,408 మంది రైతులకు మూడో విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద రూ. 108.37...
By Pagadala Venkateswar 2026-03-13 07:12:58 0 210
SURAKSHA
T. V. Anupama IAS: A Beacon of Courage and Compassion
The Journey Begins T. V. Anupama, IAS, a 2010-batch Indian Administrative...
By Fathima Safa 2026-07-14 12:40:59 0 137
Karnataka
Karnataka Jobs Bonanza: 72,000 Govt Vacancies Approved
In a major boost for job seekers, the Karnataka Cabinet has approved a massive recruitment drive...
By Lokeshwari Panthadi 2026-06-30 08:49:25 0 91
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com